News December 29, 2024
ORR లీజులోనూ అవకతవకలు: కోమటిరెడ్డి
TG: హైదరాబాద్ ORR లీజుకు ఇవ్వడంపై విచారణ జరుగుతోందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి వెల్లడించారు. హరీశ్రావు కోరడంతోనే దీనిపై SIT విచారణకు ఆదేశించామని, దీనిలోనూ అవకతవకలు బయటపడతాయన్నారు. ఫార్ములా-ఈ కార్ రేసులో దొంగలు దొరికారని పరోక్షంగా KTRపై మండిపడ్డారు. అటు 2017లో ఆగిపోయిన RRR ప్రాజెక్టుపై తమ కృషి వల్లే ముందడుగు పడిందని, ఇందుకు సహకరించిన ప్రధాని మోదీ, గడ్కరీకి కోమటిరెడ్డి ధన్యవాదాలు తెలిపారు.
Similar News
News January 1, 2025
అయోధ్య రామయ్యను దర్శించుకున్న 2 లక్షల మంది
అయోధ్యలోని బాల రాముడి ఆలయంలో నూతన సంవత్సర వేడుకలను జరుపుకునేందుకు ప్రజలు క్యూ కట్టారు. ఉదయం 7 గంటల నుంచి భక్తులకు దర్శనం కల్పిస్తుండగా ఇప్పటికే 2 లక్షల మంది రామ్లల్లాను దర్శించుకున్నట్లు రామజన్మభూమి ట్రస్ట్ పేర్కొంది. రాత్రి 9 గంటల వరకు ప్రవేశం ఉంటుందని వెల్లడించింది. మీలో ఎవరైనా అయోధ్యకు వెళ్లారా? ఇవాళ ఏ ఆలయాలను సందర్శించారో కామెంట్ చేయండి.
News January 1, 2025
తిరుపతిలో టోకెన్లు ఇచ్చే లొకేషన్లు ఇవే..!
AP: తిరుమల శ్రీవారి ఆలయంలో జనవరి 10 నుంచి 19 వరకు వైకుంఠ ద్వార దర్శనాలు ఉంటాయి. దీనికి సంబంధించి తిరుపతిలో జనవరి 9వ తేదీ ఉదయం 5 గంటల నుంచి SSD టోకెన్లు ఇవ్వనున్నారు. ఆ ఏరియాలు ఇవే..
➤ రామచంద్ర పుష్కరిణి ➤ జీవకోన ZP స్కూల్ ➤ ఇందిరా మైదానం ➤ శ్రీనివాసం రెస్ట్ హౌస్ ➤ విష్ణునివాసం ➤ 2వ చౌల్ట్రీ ➤ రామానాయుడు హైస్కూల్ బైరాగిపట్టెడ ➤ ఎమ్మార్ పల్లి జడ్పీ స్కూల్. తిరుమలలో ఒక కౌంటర్ ఏర్పాటుచేశారు.
News January 1, 2025
దిల్ రాజు కాదు డీల్ రాజు: బీఆర్ఎస్ నేతలు
TG: రాజకీయాల కోసం సినిమాలు వాడుకోవద్దన్న సినీ నిర్మాత, FDC ఛైర్మన్ <<15030891>>దిల్ రాజు వ్యాఖ్యలపై<<>> బీఆర్ఎస్ నేతలు తీవ్ర విమర్శలు చేశారు. దిల్ రాజు కాంగ్రెస్ తొత్తుగా మారారని దుయ్యబట్టారు. మంత్రి కొండా సురేఖ అనుచిత వ్యాఖ్యలు చేసినప్పుడు ఆయన ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. ఆయన దిల్ రాజు కాదు డీల్ రాజు అని క్రిశాంక్, ఎర్రోళ్ల శ్రీనివాస్ సెటైర్లు వేశారు.