News December 5, 2024
రైతు సేవా కేంద్రాల్లో అవకతవకలు.. ముగ్గురి అధికారుల సస్పెన్షన్!

AP: కృష్ణా జిల్లాలోని పలు రైతు సేవా కేంద్రాల్లో జరుగుతున్న అవకతవకలపై సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల నుంచి ఎక్కువ ధాన్యం సేకరించి రికార్డుల్లో తక్కువ చూపించడంపై మండిపడ్డారు. దీంతో ఇద్దరు కస్టోడియల్ ఆఫీసర్లు, టీఏను అధికారులు సస్పెండ్ చేశారు. అధికారులు నిర్లక్ష్యం వహిస్తే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు.
Similar News
News January 27, 2026
ఇకపై 6 నెలల్లోనే రిక్రూట్మెంట్ పూర్తి: TGPSC

TG: ఈ ఏడాది నుంచి ఉద్యోగ నియామకాల్లో ఫలితాల కోసం ఏళ్ల తరబడి ఎదురుచూడాల్సిన పరిస్థితి ఉండబోదని TGPSC ఛైర్మన్ బుర్రా వెంకటేశం తెలిపారు. నోటిఫికేషన్ ఇచ్చాక సింగిల్ స్టేజ్ పరీక్షలు 3 నెలల్లో, మల్టీ స్టేజ్ పరీక్షలను 6 నెలల్లో పూర్తి చేస్తామని ప్రకటించారు. ఉద్యోగ నియామకాల్లో టైం లైన్స్ పాటిస్తామని పేర్కొన్నారు. పెండింగ్‌లో ఉన్న రిక్రూట్మెంట్లను పూర్తి చేశామని చెప్పారు.
News January 27, 2026
ఈ ప్రధాన పంటలకు ఈ ఎర పంటలతో మేలు

☛ వరి చుట్టూ జీలుగ వేసి కాండం తొలిచే పురుగు ఉద్ధృతి తగ్గించవచ్చు. ☛ మొక్కజొన్న చుట్టూ జొన్న మొక్కలను నాటి మొవ్వు ఈగ, కాండం తొలిచే పురుగును కట్టడి చేయొచ్చు. ☛ చెరకు పంట చుట్టూ కుంకుమ బంతి, సోయా చిక్కుడు వేసి నులి పురుగులను నివారించవచ్చు. ☛ పొగాకు చుట్టూ ఆముదం పంట వేసి పొగాకు లద్దె పురుగులను నియంత్రించవచ్చు. ☛ మిరప చుట్టూ ఆముదం పంట వేసి కాయతొలుచు పురుగులను కట్టడి చేయొచ్చు.
News January 27, 2026
ఈ ఏడాదే గగన్‌యాన్ తొలి ప్రయోగం

ఇస్రో ప్రతిష్ఠాత్మక గగన్‌యాన్ ప్రాజెక్టు కీలక దశకు చేరుకున్నట్లు షార్ డైరెక్టర్ ఈఎస్ పద్మకుమార్ తెలిపారు. ఈ ఏడాదే గగన్‌యాన్-1 తొలి మానవరహిత ప్రయోగం నిర్వహించనున్నట్లు వెల్లడించారు. G-1, G-2, G-3 మిషన్ల అనంతరం 2027 నాటికి మానవ సహిత అంతరిక్ష యాత్ర చేపడతామన్నారు. ఈ ఏడాది 20-25 ప్రయోగాలు లక్ష్యంగా పెట్టుకున్నామని, ఫిబ్రవరి లేదా మార్చిలో ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్‌ను ప్రయోగించనున్నామని అన్నారు.


