News June 22, 2024

వైసీపీది బాధ్యతారాహిత్యం: సత్యకుమార్

image

AP: సభాపతి స్థానానికి అయ్యన్నపాత్రుడు అన్ని విధాలా అర్హులని మంత్రి, బీజేపీ ఎమ్మెల్యే సత్యకుమార్ అన్నారు. అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ..’ అల్లరిని అరికట్టే ప్రిన్సిపల్‌గా అయ్యన్న వ్యవహరించాలి. ఆయన అనుభవం కొత్త సభ్యులకు మార్గదర్శకం కావాలి’ అని అన్నారు. సభాపతి బాధ్యతలు చేపట్టే ముఖ్యమైన ఘట్టానికి YCP హాజరుకాకపోవడం సరికాదని అన్నారు. ఇది ఆ పార్టీ బాధ్యతారాహిత్యానికి నిదర్శనమని ఫైర్ అయ్యారు.

Similar News

News November 28, 2025

నాగర్ కర్నూల్: సర్పంచ్‌ నామినేషన్లు తిరస్కరణకు కారణాలు ఇవే!

image

NGKL జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా సర్పంచ్ అభ్యర్థుల నామినేషన్లు తిరస్కరణకు గురయ్యే ప్రధాన కారణాలను అధికారులు వెల్లడించారు:
నిర్దేశిత సమయం దాటిన తర్వాత పత్రాలు దాఖలు చేయడం.
అభ్యర్థులు, ప్రతిపాదించే వారి సంతకాలు లేకపోవడం.
నేర చరిత్ర కలిగి ఉండటం.
ఆస్తులు, అప్పులు, విద్యార్హతల సమాచారాన్ని సరిగా పొందుపరచకపోవడం.
చట్ట ప్రకారం అవసరమైన డిపాజిట్ నగదు చెల్లించకపోవడం వంటివి ముఖ్య కారణాలు.

News November 28, 2025

సర్పంచ్ పదవి కోసమే పెళ్లి.. చివరకు!

image

TG: సర్పంచ్ అయ్యేందుకు హుటాహుటిన పెళ్లి చేసుకొని బోల్తా పడిన ఓ వ్యక్తిని నెటిజన్లు తెగ ట్రోల్స్ చేస్తున్నారు. కరీంనగర్(D) నాగిరెడ్డిపూర్ సర్పంచ్ స్థానం ఎస్సీ మహిళకు రిజర్వ్ అయింది. దీంతో సర్పంచ్ అవ్వడం కోసం ముచ్చె శంకర్‌ వెంటనే నల్గొండ(D)కు చెందిన మహిళను పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. మొన్న పెళ్లి జరగ్గా ఓటర్‌గా దరఖాస్తు చేయడంలో ఆలస్యం అయింది. ఆలోపే నోటిఫికేషన్ రావడంతో అతనికి నిరాశే మిగిలింది.

News November 28, 2025

నాన్-ఏసీ కోచ్‌ల్లోనూ దుప్పటి, దిండు

image

రైలు ప్రయాణికులకు సదరన్ రైల్వే శుభవార్త చెప్పింది. 2026 జనవరి 1 నుంచి నాన్-ఏసీ స్లీపర్‌లో కూడా దుప్పటి, దిండు సౌకర్యం అందుబాటులోకి వస్తుందని ప్రకటించింది. ఇందుకోసం ప్రయాణికులు నిర్ణీత ఛార్జీలు చెల్లించాలని పేర్కొంది. ఈ మేరకు రూ.50, రూ.30, రూ.20లలో మూడు ప్యాకేజీలు తీసుకొచ్చింది. ఈ సౌకర్యాన్ని చెన్నై డివిజన్ ఎంపిక చేసిన 10 రైళ్లలో ప్రయోగాత్మకంగా ప్రారంభిస్తోంది.