News March 21, 2024
ఐఆర్ఎస్ To ఉద్యమం To పాలిటిక్స్

కేజ్రీవాల్ 1968 ఆగస్టు 16న హరియాణాలో జన్మించారు. ఐఐటీ ఖరగ్పూర్లో మెకానికల్ ఇంజినీరింగ్ చేసిన ఆయన 1999లో ఐఆర్ఎస్కి ఎంపికయ్యారు 1999-2000ల మధ్య పరివర్తన్ ఉద్యమాన్ని చేపట్టారు. 2006లో ఉద్యోగానికి రాజీనామా చేసి పబ్లిక్ కాజ్ రీసెర్చ్ ఫౌండేషన్ను స్థాపించారు. 2011లో అన్నా హజారేతో కలిసి జన లోక్పాల్ బిల్లు కోసం పోరాడి జాతీయ స్థాయిలో పేరుతెచ్చుకున్నారు. 2012లో AAPని స్థాపించి రెండు సార్లు సీఎం అయ్యారు.
Similar News
News April 8, 2025
త్వరలో వాట్సాప్లో కొత్త ఫీచర్

వాట్సాప్ ప్లాట్ఫామ్ త్వరలోనే కొత్త సెక్యూరిటీ ఫీచర్ అందుబాటులోకి తెచ్చే ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో చాటింగ్, షేర్ చేసిన వీడియోస్, ఫోటోలు రిసీవర్ సేవ్ చేసుకునే అవకాశం లేకుండా కొత్త ఫీచర్ డెవలప్ చేస్తుంది. దీంతో మన వ్యక్తిగత సమాచారం భద్రంగా ఉంటుంది. అయితే స్క్రీన్ రికార్డింగ్, స్క్రీన్షాట్ల ద్వారా సేవ్ చేసే విషయంపై స్పష్టతనివ్వలేదు. ప్రస్తుతం IOSయూజర్స్ కోసం ఈ ఫీచర్ను పరీక్షిస్తున్నారు.
News April 8, 2025
గెజిట్ జారీ.. అమల్లోకి వచ్చిన వక్ఫ్ సవరణ చట్టం

వక్ఫ్ సవరణ చట్టంపై కేంద్రం గెజిట్ జారీ చేసింది. దీంతో దేశవ్యాప్తంగా ఈ చట్టం తక్షణమే అమల్లోకి వచ్చినట్లు అయింది. ఈ చట్టంతో వక్ఫ్ బోర్డుల కింద నమోదైన ఆస్తులపై ప్రభుత్వ పర్యవేక్షణ ఉంటుంది. మరోవైపు ఈ సవరణ చట్టంపై దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది. ఈ నెల 15, 16 తేదీల్లో అవి విచారణకు రానున్నాయి. కాంగ్రెస్, ఎంఐఎం, డీఎంకే తదితర పార్టీలు ఈ వక్ఫ్ చట్టంపై సుప్రీంకోర్టును ఆశ్రయించాయి.
News April 8, 2025
పూరన్ దెబ్బకు సెహ్వాగ్ రికార్డు బద్దలు

KKRతో మ్యాచులో LSG విధ్వంసకర ప్లేయర్ నికోలస్ పూరన్ (36 బంతుల్లోనే 87 ) ఊచకోత కోశారు. ఈ క్రమంలో పూరన్ ఓ రికార్డును తన ఖాతాలో వేసుకున్నారు. ఐపీఎల్లో అత్యంత వేగంగా 2,000 పరుగులు చేసిన రెండో ప్లేయర్గా రికార్డు సృష్టించారు. 1,198 బంతుల్లోనే ఆయన 2 వేల పరుగులు మార్కును అందుకున్నారు. ఈ క్రమంలో వీరేంద్ర సెహ్వాగ్ (1,211 బంతుల్లో) రికార్డును చెరిపేశారు. అగ్ర స్థానంలో రస్సెల్ (1,120 బంతుల్లో) ఉన్నారు.