News November 26, 2024
13 ఏళ్ల వైభవ్ IPLలో ఆడేందుకు అర్హుడా?

IPL వేలంలో 13 ఏళ్ల వైభవ్ సూర్యవంశీని RR దక్కించుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో వైభవ్ అసలు IPL ఆడేందుకు అర్హుడా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. IPLలో ఆడేందుకు కనీస నిబంధనలేవీ లేవు. కానీ అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడాలంటే 15 ఏళ్లు ఉండాలి. అయితే ఆయా దేశాల క్రికెట్ బోర్డులు డిక్లరేషన్ సమర్పించి 15 ఏళ్లలోపు వారినీ ఆడించొచ్చు. పాక్‌కు చెందిన హసన్ రజా(14 ఏళ్ల 227 రోజులు) అంతర్జాతీయ మ్యాచ్ ఆడిన పిన్న వయస్కుడు.
Similar News
News November 28, 2025
‘టీఈ-పోల్’ యాప్ వినియోగించండి: వరంగల్ కలెక్టర్

ఓటర్లకు గ్రామ పంచాయతీ ఎన్నికల సమాచారం సులభంగా చేరేందుకు రూపొందించిన టీఈ-పోల్ మొబైల్ యాప్‌ను వినియోగించాలని వరంగల్ కలెక్టర్ సత్యశారద సూచించారు. కలెక్టరేట్‌లో విలేకరులతో మాట్లాడిన ఆమె, గూగుల్ స్టోర్‌లో యాప్ అందుబాటులో ఉందని తెలిపారు. పోలింగ్ కేంద్రం, ఓటర్ స్లిప్ వంటి వివరాలను యాప్ ద్వారా తెలుసుకోవచ్చని, ప్రతి ఓటరు స్వేచ్ఛగా ఓటు వేయాలని, ఎన్నికల్లో చురుకుగా పాల్గొనాలని కోరారు.
News November 28, 2025
చెక్క దువ్వెన వాడుతున్నారా?

జుట్టు ఆరోగ్యం కోసం ప్రస్తుతం చాలామంది చెక్క దువ్వెన వాడుతున్నారు. కానీ దీన్ని క్లీన్ చేయకపోతే బ్యాక్టీరియా పెరిగిపోతుంది. గోరువెచ్చని నీటిలో డిష్‌వాష్ లిక్విడ్/ షాంపూ, కొబ్బరి, ఆలివ్ నూనెలను కలపాలి. దువ్వెనను ఈ మిశ్రమంలో 2 నిమిషాలు ఉంచి బ్రష్‌తో రుద్దాలి. తర్వాత ఎండలో ఆరబెడితే సరిపోతుంది. నీటితో వద్దు అనుకుంటే నూనెను దువ్వెన మొత్తం పట్టించి ఓ అరగంటయ్యాక బ్రష్‌తో దువ్వెన పళ్లను శుభ్రం చేయాలి.
News November 28, 2025
మహమూద్‌పట్నం పంచాయతీ ఎన్నిక నిలిపివేత

TG: మహబూబాబాద్(D) మహమూద్‌పట్నం పంచాయతీ ఎన్నికను నిలిపివేస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. 2025 ఓటర్ల జాబితాను పరిగణనలోకి తీసుకోకుండా 2011 లెక్కల ప్రకారం రిజర్వేషన్లు సరికాదంది. అక్కడ ఉన్న ఆరుగురు STలకు సర్పంచి, 3 వార్డులను కేటాయించడాన్ని తప్పుపట్టింది. తదుపరి విచారణను డిసెంబరు 29కి వాయిదా వేసింది. ఈ ఎన్నికలో రిజర్వేషన్‌ను సవాల్ చేస్తూ యాకూబ్ అనే వ్యక్తి పిటిషన్ దాఖలు చేశారు.


