News June 4, 2024

ఇండియా కూటమికి 295 సీట్లు సాధ్యమా? – 1/2

image

ఎగ్జిట్ పోల్స్ బీజేపీదే మళ్లీ అధికారమని అంచనా వేస్తున్నా ఇండియా కూటమి మాత్రం తాము 295 సీట్లు సాధిస్తామని ధీమాగా ఉంది. అయితే కూటమికి అంతమొత్తంలో సీట్లు రావడం సవాల్‌తో కూడుకున్నదని విశ్లేషకులు చెబుతున్నారు. ‘దక్షిణాది రాష్ట్రాలు, యూపీ, బెంగాల్‌, బిహార్, మహారాష్ట్ర, లక్షద్వీప్, అండమాన్, జమ్మూకశ్మీర్ నుంచి 295 స్థానాల్లో 176 గెలిచినా మిగతా రాష్ట్రాల్లో 119 సీట్లు గెలవాలి’ అని పేర్కొన్నారు.

Similar News

News January 28, 2026

ఈ ఉంగరం ధరిస్తే..

image

జ్యోతిషం ప్రకారం పుష్పరాగం ఎంతో పవిత్రమైనది. ఈ రత్నం గురు గ్రహానికి ప్రతీక. జ్ఞానం, సంపద, సంతోషకర వివాహ జీవితం కోసం దీన్ని ధరిస్తారు. మహిళలకు వివాహ జాప్యం తొలగడానికి, విద్యార్థులు చదువులో రాణించడానికి, ఆర్థిక స్థిరత్వం కోసం ఇది బాగా పనిచేస్తుందని నమ్మకం. పగుళ్లు లేని, పారదర్శకమైన బంగారు రంగు పుష్పరాగం ధరిస్తే ఆత్మవిశ్వాసం పెరిగి, దైవానుగ్రహం లభిస్తుందట. జీవితంలో అడ్డంకులు తొలగుతాయని నమ్ముతారు.

News January 28, 2026

NIT కాలికట్‌లో అప్రెంటిస్ పోస్టులు

image

<>నేషనల్ <<>>ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కాలికట్ 50 అప్రెంటిస్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. డిగ్రీ, డిప్లొమా, ఐటీఐ అర్హతగల అభ్యర్థులు ఫిబ్రవరి 9 వరకు అప్లై చేసుకోవచ్చు. అకడమిక్ మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. గ్రాడ్యుయేట్లకు నెలకు రూ.15వేలు, డిప్లొమా ట్రైనీలకు రూ.12,500, ఐటీఐ అభ్యర్థులకు రూ.11వేలు చెల్లిస్తారు. వెబ్‌సైట్: https://nitc.ac.in/

News January 28, 2026

అరటిలో జింకు ధాతు లోపం – నివారణ

image

అరటిలో జింకు ధాతు లోపం వల్ల లేత ఆకులు, ఈనెల వెంబటి తెల్లని చారలు ప్రారంభమై ఈనెలు పాలిపోయినట్లు లేదా పసుపు రంగుకు మారతాయి. ఈనెల వెనుక ముదురు ఊదా రంగు ఏర్పడుతుంది. ఇది తీవ్రమైతే చెట్టు ఎదుగుదల నిలిచి, గెల, పండు పరిమాణం, నాణ్యత తగ్గుతుంది. దీని నివారణకు లీటరు నీటికి జింక్ సల్ఫేట్ 2 గ్రాములను, జిగురు మందుతో కలిపి తెగులు సోకిన మొక్క ఆకులపై 10 రోజుల వ్యవధిలో 2 లేక 3 సార్లు పిచికారీ చేయాలి.