News January 4, 2025

ఆసీస్‌కు 200 టార్గెట్ సరిపోదేమో: గవాస్కర్

image

సిడ్నీ టెస్టులో ఆస్ట్రేలియాకు 200 టార్గెట్ సరిపోదేమోనని క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ అభిప్రాయపడ్డారు. ‘బుమ్రా తిరిగి మైదానంలో అడుగు పెడితేనే భారత్‌కు విజయావకాశాలు ఉంటాయి. ఆయన లేకపోతే 200 లక్ష్యాన్ని కూడా కాపాడుకోలేం. ప్రస్తుతం బుమ్రా ఆరోగ్య పరిస్థితి బాగానే ఉన్నట్లు కనిపిస్తోంది. ఆస్ట్రేలియా జట్టు ఊహకు అందకుండా బుమ్రా హెల్త్ అప్డేట్‌ను సీక్రెట్‌గా ఉంచినట్లు తెలుస్తోంది’ అని ఆయన పేర్కొన్నారు.

Similar News

News December 12, 2025

ఒకే జిల్లాలో 7,400 HIV కేసులు

image

బిహార్‌లోని సీతామఢీ జిల్లాలో ఏకంగా 7,400 HIV కేసులు వెలుగుచూశాయి. బాధితుల్లో 400 మంది చిన్నారులున్నారు. వీరికి తల్లిదండ్రుల ద్వారా వ్యాధి సోకినట్లు నిర్ధారణ అయింది. ఈ జిల్లాలో ప్రతి నెలా 40-60 దాకా కేసులు నమోదవుతున్నాయని, ప్రస్తుతం 5వేల మందికి పైగా వైద్యం అందిస్తున్నట్లు అధికారులు తెలిపారు. సరైన అవగాహన, టెస్టింగ్ లేకపోతే వ్యాధి మరింత వ్యాపిస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

News December 12, 2025

నైనిటాల్ బ్యాంక్‌లో భారీగా ఉద్యోగాలు

image

<>నైనిటాల్ బ్యాంక్<<>> 185 ప్రొబేషనరీ ఆఫీసర్, CSA, తదితర పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హులైన అభ్యర్థులు నేటి నుంచి జనవరి 1వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి డిగ్రీ/పీజీ,CA, MBA,LLB ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. JAN 18న ఎగ్జామ్ నిర్వహిస్తారు. వెబ్‌సైట్: https://www.nainitalbank.bank.in

News December 12, 2025

నేటి నుంచి U-19 ODI ఆసియా కప్

image

దుబాయ్ వేదికగా నేటి నుంచి U-19 వన్డే ఆసియా కప్ జరగనుంది. గ్రూప్Aలో భారత్, పాక్, UAE, మలేసియా, గ్రూప్Bలో అఫ్గాన్, బంగ్లా, నేపాల్, శ్రీలంక తలపడనున్నాయి. ఇవాళ తొలి మ్యాచ్‌లో UAEతో భారత్ పోటీ పడనుంది. కెప్టెన్ ఆయుశ్, వైభవ్, విహాన్, వేదాంత్, దీపేశ్, కిషన్ లాంటి ప్లేయర్లతో యంగ్ ఇండియా బలంగా ఉంది. మ్యాచ్‌లన్నీ 10.30AM నుంచి ప్రారంభమవుతాయి. సోనీ స్పోర్ట్స్ నెట్‌వర్క్, సోనీ లివ్ యాప్‌లో వీక్షించవచ్చు.