News May 27, 2024
తెలంగాణ కవులపై ఆంధ్ర సంగీత దర్శకుల పెత్తనమా?: RSP

తెలంగాణ రాష్ట్ర గీతంపై ఆంధ్రా సంగీత దర్శకుడు కీరవాణి పెత్తనం ఏంటని BRS నేత RS ప్రవీణ్ కుమార్ ప్రశ్నించారు. ‘తెలంగాణ వచ్చి పదేళ్లయినా ఇంకా పెత్తనమా? కీరవాణి మ్యూజిక్ ఇవ్వడానికి ఇది నాటు నాటు కాదు. AP పాలకుల పెత్తనంపై తిరుగుబావుటా ఎగురవేసిన అమరుల త్యాగాలు, 4 కోట్ల మంది కలల రూపం, ఒక రణ నినాదం, ధిక్కార స్వరమైన ఈ గీతాన్ని యావత్ తెలంగాణ నాడు ఆలపించింది. ఏ పాట కావాలో ప్రజలు ఆలోచించాలి’ అని Xలో కోరారు.
Similar News
News February 16, 2026
చర్మ సంరక్షణలో కొల్లాజెన్ కీలకపాత్ర

శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి, చర్మాన్ని యవ్వనంగా ఉంచడానికి కొల్లాజెన్ ప్రోటీన్ ముఖ్యం. వయసు పెరిగేకొద్దీ శరీరంలో కొల్లాజెన్ ఉత్పత్తి తగ్గుతుంది. దీంతో కీళ్ల నొప్పులు, చర్మంముడతలు, జుట్టు రాలడం వంటి సమస్యలు వస్తాయంటున్నారు నిపుణులు. గట్ ఆరోగ్యమూ దెబ్బతింటుంది. ఇలా కాకుండా ఉండాలంటే చేపలు, సిట్రస్ ఫ్రూట్స్, బెర్రీలు, గుడ్లు, ఆకుకూరలు, అవకాడో, దాల్చినచెక్క, గ్రీన్‌టీ తీసుకోవాలని సూచిస్తున్నారు.
News February 16, 2026
జామలో కాయకుళ్లు తెగులు నివారణకు సూచనలు

జామ తోటల్లో పక్వానికి వచ్చిన పండ్లపై ఈ తెగులు ప్రభావం కనిపిస్తుంది. కాయకుళ్లు సోకిన జామ పండ్లపై గుండ్రటి గోధుమ రంగు మచ్చలు గుంటలు పడి కనిపిస్తాయి. గోధుమ మచ్చలపై గులాబీ రంగు మచ్చలు కూడా కనిపిస్తాయి. మచ్చలు ఏర్పడిన 3 నుంచి 4 రోజుల్లో పండు కుళ్లిపోతుంది. దీని నివారణకు కాయలు ఏర్పడే సమయంలో కాపర్ ఆక్సీక్లోరైడ్ లీటర్ నీటికి 4గ్రాముల చొప్పున 15 రోజుల వ్యవధిలో 2 నుంచి 3 సార్లు పిచికారీ చేసుకోవాలి.
News February 16, 2026
మేయర్, ఛైర్మన్ల ఎన్నిక ఇలా..

TG: ఇవాళ 7 కార్పొరేషన్ల మేయర్లు, 116 మున్సిపాలిటీల ఛైర్మన్ల ఎన్నిక జరగనుంది. ఉ.11 గంటలకు గెలిచినవారితో అధికారులు ప్రమాణం చేయిస్తారు. తర్వాత ఆయా పదవులకు నామినేషన్లు స్వీకరిస్తారు. మిగతా సభ్యులతో పాటు ఎక్స్ అఫీషియో సభ్యులు(MP,MLA,MLC) చేతులెత్తి మద్దతు తెలుపుతారు. 50 శాతానికిపైగా ఓట్లు వచ్చినవారిని విన్నర్‌గా ప్రకటిస్తారు. సమాన ఓట్లు వస్తే లాటరీ ద్వారా విజేతను నిర్ణయిస్తారు.


