News October 18, 2024
తల్లిదండ్రులను ఎవరైనా వేధిస్తున్నారా? కాల్ చేయండి!

తల్లిదండ్రులతో కొందరు ప్రవర్తిస్తున్న తీరు ఆందోళన కలిగిస్తోందని TGSRTC ఎండీ సజ్జనార్ అన్నారు. ‘జీవితంలో మనం సాధించేదంతా తల్లిదండ్రుల సపోర్ట్, త్యాగాల వల్లనే అని మరిచిపోకూడదు. ఒకప్పుడు జీవితంలో అత్యంత ముఖ్యమైన వారిని ఇప్పుడు భారంగా ఎలా చూడగలుగుతున్నారు? ఇది నిజంగా హృదయ విదారకమైనది. అలాంటి వారిని చట్టపరంగా శిక్షించాలి. ఎవరైనా పేరెంట్స్‌ను వేధిస్తే డయల్ 100కి కాల్ చేసి ఫిర్యాదు చేయండి’ అని తెలిపారు.
Similar News
News September 17, 2025
కాసేపట్లో ఈ జిల్లాల్లో వర్షం

TG: రాబోయే 3గంటల్లో నిజామాబాద్, సిద్దిపేట, భువనగిరిలో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని IMD ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఆదిలాబాద్, కొత్తగూడెం, HYD, జగిత్యాల, జనగాం, BHPL, కామారెడ్డి, KNR, ఖమ్మం, ఆసిఫాబాద్, మహబూబాబాద్, మంచిర్యాల, మెదక్, మేడ్చల్, ములుగు, నాగర్ కర్నూల్, నల్గొండ, నిర్మల్, PDPL, సిరిసిల్ల, సంగారెడ్డి, సూర్యాపేట, వికారాబాద్, వరంగల్ జిల్లాల్లో తేలికపాటి వానలు పడతాయని పేర్కొంది.
News September 17, 2025
PM AI వీడియో తొలగించండి: పట్నా హైకోర్టు

ప్రధాని మోదీని ఆయన తల్లి మందలిస్తున్నట్టు రూపొందించిన <<17688399>>AI వీడియోను<<>> సోషల్ మీడియా నుంచి తొలగించాలని బిహార్‌లోని పట్నా హైకోర్టు కాంగ్రెస్ పార్టీని ఆదేశించింది. SEP 10న బిహార్ కాంగ్రెస్ మోదీపై AI వీడియో క్రియేట్ చేసి Xలో పోస్ట్ చేసిన విషయం తెలిసిందే. దీన్ని బీజేపీ, NDA మిత్ర పక్షాలు తీవ్రంగా ఖండించాయి. దీనిపై బీజేపీ ఢిల్లీ ఎలక్షన్ సెల్ వేసిన పిటిషన్‌ను విచారించిన కోర్టు వీడియో తొలగించాలని ఆదేశించింది.
News September 17, 2025
గ్రూప్-1పై డివిజన్ బెంచ్‌కు టీజీపీఎస్సీ

TG: గ్రూప్-1 మెయిన్స్ <<17655670>>ఫలితాలను<<>> రద్దుచేస్తూ హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును టీజీపీఎస్సీ డివిజన్ బెంచ్‌లో సవాల్ చేసింది. ఈ నెల 9న ఫలితాలను రద్దు చేస్తూ కోర్టు తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే.