News June 29, 2024

అయ్యన్నపాత్రుడు అంటే జగన్‌కు భయమేమో?: మంత్రి అనిత

image

AP: అయ్యన్నపాత్రుడిని స్పీకర్‌గా ప్రకటించినప్పటి నుంచి జగన్ అసెంబ్లీకి రాలేదని హోంమంత్రి వంగలపూడి అనిత ఎద్దేవా చేశారు. ఆయనంటే YCP చీఫ్‌కు భయమేమోనన్నారు. స్పీకర్‌కు సన్మానసభలో ఆమె మాట్లాడుతూ.. ‘గత ప్రభుత్వం అయ్యన్నను తీవ్రంగా ఇబ్బంది పెట్టింది. ఇప్పుడు ఆయనను భిక్ష అడిగితే గానీ ప్రతిపక్ష హోదా రాని పరిస్థితి వచ్చింది. రెడ్ బుక్ నాకంటే అయ్యన్న వద్ద ఉంటేనే బాగుండేది’ అని పేర్కొన్నారు.

Similar News

News December 26, 2024

నిమిషానికి 158 బిర్యానీలు తినేశారు!

image

సంతోషంలో ఉన్నా, బాధలో ఉన్నా, పండుగొచ్చినా బిర్యానీలు తినాల్సిందే అన్నట్లుగా మారిపోయింది. ఆర్డర్ చేస్తే ఇంటికే బిర్యానీ వస్తుండటంతో స్విగ్గీ బుకింగ్స్‌లో బిర్యానీ <<14970078>>టాప్‌లో<<>> నిలిచింది. ఈ ప్లాట్‌ఫామ్‌లో ఈ ఏడాది నిమిషానికి ఏకంగా 158 బిర్యానీలు బుక్ అయ్యాయి. 2023లో ఈ సంఖ్య 150గా ఉండగా 2022లో 137, 2021లో 115, 2020లో నిమిషానికి 90 బిర్యానీల ఆర్డర్లు వచ్చేవి. ఏటా బుకింగ్స్ సంఖ్య పెరుగుతూనే ఉంది.

News December 26, 2024

విరాట్ కోహ్లీకి భారీ జరిమానా

image

బాక్సింగ్ డే టెస్టులో ఆస్ట్రేలియా ఓపెనర్ కోన్ట్సస్‌ను విరాట్ <<14982204>>స్లెడ్జ్<<>> చేసిన ఘటనపై ICC తీవ్రంగా స్పందించింది. కోహ్లీ మ్యాచ్ ఫీజులో 20శాతం కోత పెట్టింది. కోడ్ ఆఫ్ కండక్ట్ లెవెల్ 1 కింద ఒక డీమెరిట్ పాయింట్‌ విధించింది. నెక్స్ట్ మ్యాచ్ నుంచి ఆయన్ను తొలగిస్తారని వార్తలు రాగా ఫైన్‌తో సరిపెట్టింది.

News December 26, 2024

బాలీవుడ్, హాలీవుడ్ హైదరాబాద్ వచ్చేలా చర్యలు: CM రేవంత్

image

TG: సినీ ప్రముఖులతో భేటీ అనంతరం సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఇతర సినీ పరిశ్రమలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తామన్నారు. బాలీవుడ్, హాలీవుడ్ హైదరాబాద్ వచ్చేలా చర్యలు చేపడతామని చెప్పారు. టాలీవుడ్‌కు బ్రాండ్ తీసుకొచ్చి, ఉన్నత స్థాయికి తీసుకెళ్లడమే తమ ఉద్దేశమని వెల్లడించారు. తమ ప్రభుత్వం ఎల్లప్పుడూ చిత్ర పరిశ్రమకు అండగా ఉంటుందని సీఎం పేర్కొన్నారు.