News July 3, 2024
అధ్యక్ష రేసు నుంచి బైడెన్ ఔట్?

అమెరికా అధ్యక్ష బరి నుంచి జో బైడెన్ తప్పుకోవాలని భావిస్తున్నట్లు న్యూయార్క్ టైమ్స్ పత్రిక ఓ కథనంలో పేర్కొంది. గత కొంతకాలంగా ఆయన ప్రవర్తన తరచూ వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. ట్రంప్‌తో జరిగిన తాజా డిబేట్లోనూ బైడెన్ తేలిపోయారు. దీంతో సొంత పార్టీలోనే ఆయనపై వ్యతిరేకత వెల్లువెత్తుతోందని, తప్పుకోవడమే మేలని బైడెన్ భావిస్తున్నారని న్యూయార్క్ టైమ్స్ పేర్కొంది. ఆ కథనాన్ని శ్వేతసౌధం ఖండించింది.
Similar News
News November 16, 2025
అరుదైన రికార్డు.. దిగ్గజాల జాబితాలో జడేజా

సౌతాఫ్రికాతో తొలి టెస్టులో టీమ్ ఇండియా ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా అరుదైన రికార్డు నెలకొల్పారు. టెస్టుల్లో 4 వేల పరుగులు, 300 వికెట్ల ఘనత సాధించిన క్రికెటర్‌గా నిలిచారు. ఈ జాబితాలో కపిల్ దేవ్, ఇయాన్ బోథమ్, డానియెల్ వెటోరీ వంటి దిగ్గజాలు ఉండటం గమనార్హం. జడేజా నిన్న బ్యాటింగ్‌లో 27 పరుగులు చేసి, 4 వికెట్లు పడగొట్టారు. ప్రస్తుతం అతడి ఖాతాలో 4017 రన్స్, 342 వికెట్స్ ఉన్నాయి.
News November 16, 2025
కార్తీకంలో నదీ స్నానం చేయలేకపోతే?

కార్తీక మాసంలో నదీ స్నానం చేయలేని భక్తులకు ప్రత్యామ్నాయ మార్గాలున్నాయి. స్నానం చేసే నీటిలో గంగాజలం/నదీ జలాన్ని కలుపుకొని స్నానమాచరించవచ్చు. ఇది నదీ స్నానం చేసినంత పుణ్యాన్ని ప్రసాదిస్తుందని నమ్మకం. అది కూడా సాధ్యం కాకపోతే, స్నానం చేసేటప్పుడు ‘గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతీ…’ అనే మంత్రాన్ని జపించాలని పండితులు సూచిస్తున్నారు. ఫలితంగా నదీ స్నానం చేసిన ఫలం లభిస్తుందని ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి.
News November 16, 2025
తెలంగాణ న్యూస్ అప్డేట్స్

*స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్లు పార్టీపరంగా కాకుండా చట్టబద్ధంగా ఇవ్వాలని CM రేవంత్‌ను R.కృష్ణయ్య కోరారు. నేడు రాష్ట్రంలో BC న్యాయసాధన దీక్షలు చేయనున్నారు.
*BRS కార్యకర్తలపై తాము దాడి చేశామని KTR చేసిన వ్యాఖ్యలు అవాస్తవమని జూబ్లీహిల్స్ MLAగా ఎన్నికైన నవీన్ యాదవ్ తెలిపారు.
*సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులపై ACB మరోసారి దాడులు చేసింది. సబ్ రిజిస్ట్రార్ల ఇళ్లలో భారీగా నగదు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.


