News October 8, 2024

ECపై BJP ఒత్తిడి చేస్తోందా: జైరామ్ రమేశ్

image

ఓట్ల లెక్కింపు తాజా వివరాలను వెబ్‌సైట్లో అప్‌డేట్ చేయకుండా ఎలక్షన్ కమిషన్‌పై బీజేపీ ఒత్తిడి చేసేందుకు ప్రయత్నిస్తోందా అని కాంగ్రెస్ సీనియర్ నేత జైరామ్ రమేశ్ ప్రశ్నించారు. ‘లోక్‌సభ ఎలక్షన్స్ తరహాలోనే అప్ టు డేట్ ట్రెండ్స్‌ను ECI వెబ్‌సైట్లో ఆలస్యంగా అప్‌డేట్ చేయడాన్ని గమనిస్తున్నాం. ఔట్ డేటెడ్, మిస్ లీడింగ్ ట్రెండ్స్‌ను షేర్ చేసేలా ECపై బీజేపీ ఒత్తిడి చేస్తోందా’ అని ట్వీట్ చేశారు.

Similar News

News November 21, 2025

ప్రాతఃకాల విశేష దర్శనంలో భద్రకాళి అమ్మవారు

image

వరంగల్ భద్రకాళి దేవస్థానంలో మార్గశిరమాసం శుక్రవారం పాడ్యమి తిథి సందర్భంగా ఆలయ అర్చకులు భద్రకాళి అమ్మవారికి అభిషేకం చేసి విశేష పూజలు చేశారు. ప్రాతఃకాల విశేష దర్శనంలో అమ్మవారు దర్శనమిచ్చారు. శుక్రవారం కావడంతో భక్తులు ఉదయం నుంచి ఆలయానికి చేరుకొని అమ్మవారిని దర్శించుకొని పూజలు చేస్తున్నారు. అనంతరం తీర్థ ప్రసాదాలు స్వీకరిస్తున్నారు.

News November 21, 2025

బిజినెస్ కార్నర్

image

* హోండా కార్స్ ఇండియా కొత్త SUV ఎలివేట్ ఏడీవీని లాంచ్ చేసింది. HYDలో ఎక్స్ షోరూమ్ ధర ₹15.20 లక్షల నుంచి ₹16.66 లక్షల వరకు ఉంటుంది.
* HYDకి చెందిన బయోలాజికల్-ఇ తయారుచేసిన న్యుమోకోకల్ కాంజుగేట్ వ్యాక్సిన్ న్యూబెవాక్స్ 14కి WHO గుర్తింపు లభించింది. ఇది 14 రకాల న్యుమోనియా, మెదడువాపు, సెప్సిస్ వ్యాధుల నుంచి రక్షణ కల్పిస్తుంది.
* అంతర్జాతీయ సంస్థలు సొనొకో, EBG గ్రూప్ HYDలో కార్యాలయాలు నెలకొల్పాయి.

News November 21, 2025

ఈ పంటలతో పురుగుల కట్టడి, అధిక దిగుబడి

image

నాటే దశ నుంచి కోత వరకు అనేక రకాలైన పురుగులు పంటను ఆశించడం వల్ల దిగుబడి తగ్గుతోంది. ఈ పురుగులను విపరీతంగా ఆకర్షించే కొన్ని రకాల ఎర పంటలతో మనం ప్రధాన పంటను కాపాడుకోవచ్చు. దీని వల్ల పురుగు మందుల వినియోగం, ఖర్చు తగ్గి రాబడి పెరుగుతుంది. వరి గట్లపై బంతిని సాగు చేసి పంటకు చీడల ఉద్ధృతిని తగ్గించినట్లే మరిన్ని పంటల్లో కూడా చేయొచ్చు. అవేంటో తెలుసుకోవడానికి <<-se_10015>>పాడిపంట కేటగిరీ<<>> క్లిక్ చేయండి.