News March 7, 2025
హైకోర్టుకు బోరుగడ్డ బురిడీ?

AP: అనుచిత వ్యాఖ్యల కేసులో అరెస్టయిన బోరుగడ్డ అనిల్ హైకోర్టునే బురిడీ కొట్టించి బెయిల్ పొందినట్లు ఆంధ్రజ్యోతి కథనంలో పేర్కొంది. తల్లికి అనారోగ్యం పేరుతో ఫేక్ సర్టిఫికెట్ అందించినట్లు తెలిపింది. దీంతో గత నెల 15నే బెయిల్ వచ్చిందని రాసుకొచ్చింది. అయితే ఆ ధ్రువపత్రం తాము ఇవ్వలేదని సదరు ఆస్పత్రి వెల్లడించినట్లు వివరించింది. వాస్తవాలను నిగ్గు తేల్చేందుకు కోర్టు విచారణకు ఆదేశించిందని పేర్కొంది.
Similar News
News December 5, 2025
నిర్మల్: రోడ్ల గుంతల కోసం క్యూఆర్ కోడ్.. కలెక్టర్ ప్రత్యేక డ్రైవ్

నిర్మల్ మున్సిపాలిటీ పరిధిలోని రోడ్ల మరమ్మతు కోసం కలెక్టర్ అభిలాష అభినవ్ క్యూఆర్ కోడ్ను ప్రవేశపెట్టారు. ప్రజలు తమ పరిసర ప్రాంతాల్లో రోడ్లపై ఉన్న గుంతల ఫోటోలను పూర్తి వివరాలతో సహా ఈ క్యూఆర్ కోడ్ ద్వారా అధికారులకు పంపవచ్చు. సమాచారం ఆధారంగా గుంతలను తక్షణమే పూడ్చేందుకు మున్సిపల్ అధికారులు ప్రత్యేక టీంలను ఏర్పాటు చేసి, డ్రైవ్ నిర్వహిస్తున్నారు. గుంతలు లేని రోడ్లను ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నారు.
News December 5, 2025
763 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

DRDO ఆధ్వర్యంలోని సెంటర్ ఫర్ పర్సనల్ టాలెంట్ మేనేజ్మెంట్( CEPTAM) 763 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. వీటిలో సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్-B పోస్టులు 561, టెక్నీషియన్-A పోస్టులు 203 ఉన్నాయి. అభ్యర్థుల వయసు 18 – 28 ఏళ్ల మధ్య ఉండాలి. డిసెంబర్ 9 నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నారు. వెబ్సైట్: https://www.drdo.gov.in *మరిన్ని ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం కోసం<<-se_10012>> జాబ్స్ <<>>కేటగిరీకి వెళ్లండి.
News December 5, 2025
విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్లో ఉద్యోగాలు.. అప్లై చేశారా?

ఇస్రో-<


