News March 21, 2024

చీపురుపల్లిలో బొత్స సేఫేనా?

image

AP: చీపురుపల్లి నుంచి మంత్రి బొత్స సత్యనారాయణ మూడు సార్లు గెలిచారు. కానీ ఈ సారి ఆయనను ఓడించి తీరాలని టీడీపీ చీఫ్ చంద్రబాబు తీవ్ర కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. మాజీ మంత్రులు గంటా శ్రీనివాసరావు, కిమిడి కళా వెంకట్రావును అక్కడ పోటీ చేయించాలనుకుంటున్నా వారు ఆసక్తి చూపడం లేదు. మరోవైపు బొత్స తనదైన రాజకీయంతో దూసుకుపోతున్నారు. ప్రస్తుతం బొత్స సేఫ్ జోన్‌లోనే ఉన్నట్లు రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

Similar News

News November 21, 2025

జాబ్ చేస్తున్నారా..? ఈ షిఫ్టు మహా డేంజర్!

image

ప్రస్తుతం కంపెనీని బట్టి డే, నైట్, రొటేషనల్ షిఫ్ట్స్ ఉంటున్నాయి. అయితే దీర్ఘకాలిక ఆరోగ్యంపై షిఫ్ట్ డ్యూటీల ప్రభావాన్ని పరిశీలిస్తే.. డే షిఫ్టులు సురక్షితమైనవని వైద్యులు చెబుతున్నారు. అదే రొటేషనల్ షిఫ్టులు ప్రమాదకరమని, షెడ్యూల్ తరచూ మారితే శరీరం సర్దుబాటు చేసుకోలేదని హెచ్చరించారు. దీనివల్ల నిద్రలేమి, గుండె జబ్బులు, మధుమేహం వచ్చే ప్రమాదం ఉందన్నారు. దీంతో పోల్చితే నైట్ షిఫ్ట్ కాస్త బెటర్ అంటున్నారు.

News November 21, 2025

iBOMMA రవి విచారణలో కీలక విషయాలు

image

iBOMMA రవి రెండో రోజు విచారణలో సైబర్ క్రైమ్ పోలీసులు కీలక సమాచారం సేకరించారు. తమిళ, హిందీ వెబ్‌సైట్ల నుంచి సినిమాలు కొనుగోలు చేసిన రవి క్రిప్టో ద్వారా పేమెంట్‌ చేసినట్లు గుర్తించారు. ఐబొమ్మ వెబ్‌సైట్‌ను బెట్టింగ్ యాప్స్‌కు గేట్‌వేగా ఉపయోగించి వచ్చిన డబ్బులతో సినిమాలు కొనుగోలు చేసినట్లు కనుగొన్నారు. కరీబియన్ దీవుల్లో ఆఫీసు ఏర్పాటు చేసి, 20 మందితో కంటెంట్‌ను అప్‌లోడ్ చేయిస్తున్నట్లు తేల్చారు.