News January 12, 2025

పార్కింగ్ స్థలం ఉంటేనే కారు రిజిస్ట్రేషన్?

image

కారు కొనాలంటే డబ్బులుంటే చాలు అనుకుంటున్నారా? దానిని పార్క్ చేసుకునేందుకు స్థలం కూడా ఉండాలంటోంది మహారాష్ట్ర ప్రభుత్వం. ట్రాఫిక్‌ నియంత్రణ, కాలుష్యాన్ని తగ్గించేందుకు సీఎం ఫడణవీస్ కొత్త రూల్ తీసుకొచ్చే యోచనలో ఉన్నట్లు సమాచారం. దీని ప్రకారం కారు రిజిస్ట్రేషన్ సమయంలో ‘పార్కింగ్ ఏరియా’ సర్టిఫికెట్ సమర్పించాలి. ముంబై, నాగ్‌పుర్, పుణేతో సహా కీలక పట్టణాల్లో ఈ రూల్ వచ్చే అవకాశం ఉంది. దీనిపై మీ కామెంట్?

Similar News

News January 12, 2025

కుంభమేళా వెనుక కథ ఏంటంటే..

image

కుంభమేళా గురించిన తొలి ప్రస్తావన రుగ్వేదంలో వచ్చింది. క్షీరసాగర మథనంలో ఉద్భవించిన అమృత కుంభం నుంచి నాలుగు చుక్కలు ప్రయాగరాజ్, హరిద్వార్, నాసిక్, ఉజ్జయిని నగరాల్లో పడ్డాయని ప్రతీతి. ఆ పవిత్రతను పురస్కరించుకుని నగరాల్లోని నదుల్లో 12ఏళ్లకోసారి జరిపే వేడుకే కుంభమేళా. త్రివేణీ సంగమంలో రేపటి నుంచి 45 రోజుల పాటు ఈ అద్భుత కార్యక్రమం ఆవిష్కృతం కానుంది. కోట్ల సంఖ్యలో భక్తులు పోటెత్తనున్నారని అంచనా.

News January 12, 2025

కుక్క బర్త్ డే కోసం రూ.5లక్షలు ఖర్చు!

image

పెంపుడు కుక్కలను సొంత పిల్లల్లాగా చూసుకునే వారి సంఖ్య పెరిగిపోయింది. కొందరు వాటికి పుట్టినరోజులు, సీమంతాలు కూడా చేస్తుంటారు. తాజాగా ఝార్ఖండ్‌కు చెందిన సప్నా అనే మహిళ తన కుక్క బర్త్ డే కోసం రూ.5 లక్షలు ఖర్చు చేసి వార్తల్లో నిలిచారు. వేడుక కోసం రూ.40వేల ఖరీదైన స్పెషల్ కేక్‌ను ఏర్పాటు చేయగా 300 మందికి ఆతిథ్యాన్ని అందించడం విశేషం.

News January 12, 2025

మళ్లీ విద్యార్థి రాజకీయాలు రావాలి: సీఎం

image

TG: విద్యార్థి దశలో సిద్ధాంతపరమైన భావజాలం తగ్గిపోవడం వల్లే పార్టీ ఫిరాయింపులు పెరిగాయని సీఎం రేవంత్ అన్నారు. రాష్ట్రంలో మళ్లీ విద్యార్థి రాజకీయాలు రావాలని అభిప్రాయపడ్డారు. తమిళనాడులో అన్ని పార్టీలు ఏకమై రాష్ట్రం కోసం పని చేస్తాయని, తెలంగాణలోనూ ఆ సంప్రదాయం రావాలని తెలిపారు. మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు ఆత్మకథ ‘ఉనిక’ పుస్తకాన్ని సీఎం ఆవిష్కరించారు.