News December 29, 2024

అప్పులు చేయడమేనా చంద్రబాబు విజన్?: బుగ్గన

image

AP: అప్పులు చేయడంలో కూటమి సర్కార్ దూసుకెళ్తోందని వైసీపీ నేత బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఎద్దేవా చేశారు. అప్పులు చేయడమేనా చంద్రబాబు విజన్ అని ఆయన విమర్శించారు. హైదరాబాద్‌లో బుగ్గన మీడియాతో మాట్లాడారు. ‘6 నెలల్లోనే రూ.1,12,750 కోట్ల అప్పులు చేశారు. ఈ అప్పులన్నీ ఎవరు కడతారు? ఇప్పటివరకు మేనిఫెస్టోలో ఇచ్చిన ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు. చంద్రబాబు మేనిఫెస్టో ఏమయ్యింది?’ అని ఆయన ప్రశ్నించారు.

Similar News

News January 1, 2025

2024లో కోహ్లీ కన్నా రోహిత్ బెస్ట్.. కానీ!

image

BGTలో ఘోర ఓటములతో సీనియర్లు రిటైర్ అవ్వాలన్న డిమాండ్లు పెరగాయి. కోహ్లీ కన్నా రోహిత్‌పై ఎక్కువ విమర్శలు వస్తున్నాయి. 2024లో రన్‌మెషీన్‌తో పోలిస్తే హిట్‌మ్యానే మెరుగైన ప్రదర్శన చేశారు. 3 ఫార్మాట్లలో 28 మ్యాచులాడిన అతడు 31.18 AVG, 86.83 SRతో 1154 రన్స్ చేశారు. 3 సెంచరీలు, 7 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఇక 23 మ్యాచులాడిన విరాట్ 21.83 AVG, 73.38 SRతో చేసింది 655 రన్సే. 1 సెంచరీ, రెండు 50లు ఖాతాలో ఉన్నాయి.

News January 1, 2025

మధ్యాహ్నం దూకుడు పెంచిన స్టాక్‌మార్కెట్లు..

image

ఉదయం ఫ్లాటుగా మొదలైన బెంచ్‌మార్క్ సూచీలు మధ్యాహ్నం పుంజుకున్నాయి. ప్రస్తుతం భారీ లాభాల్లో చలిస్తున్నాయి. సెన్సెక్స్ 78,490 (+353), నిఫ్టీ 23,738 (+94) వద్ద ట్రేడవుతున్నాయి. FMCG, IT, BANKING షేర్లు ఇందుకు దన్నుగా నిలిచాయి. తక్కువకే దొరుకుతున్న నాణ్యమైన షేర్లను ఇన్వెస్టర్లు కొనుగోలు చేస్తున్నారు. 2025లో ఔట్‌లుక్ మెరుగ్గా లేకపోవడంతో అప్రమత్తత పాటిస్తున్నారు. M&M, LT, ASIAN PAINTS టాప్ గెయినర్స్.

News January 1, 2025

మీకు తెలుగు అంకెలొచ్చా?

image

ఆర్టీసీ ఓల్డ్ బస్సుల నంబర్ ప్లేట్లను ఎప్పుడైనా గమనించారా? చాలా వాటికి నంబర్లు తెలుగు అక్షరాల్లో ఉంటాయి. కానీ, చాలా మందికి వాటి అర్థాలు తెలియదు. అలాంటివారికోసం తెలుగు అంకెల పట్టికను నెటిజన్లు షేర్ చేస్తున్నారు. వీటిని నేర్చుకోవడం వల్ల ఏదో ఒక సమయంలో పనికొస్తాయి. ఈ అంకెలు ముందే తెలిసుంటే కామెంట్ చేయండి.