News December 16, 2024

మద్యం తాగితే ఇంత ప్రమాదమా..!

image

మద్యమే అన్నింటికీ పరిష్కారం అన్నట్లుగా తాగేస్తుంటారు. కానీ మద్యపానం దీర్ఘకాలిక నిద్ర సమస్యలకు దారితీస్తుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అలాగే గుండె వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతుందన్నారు. ఆల్కహాల్ లైంగిక సామర్థ్యంతో పాటు టెస్టోస్టెరాన్ స్థాయుల్ని తగ్గిస్తుందని సూచించారు. డ్రంక్&డ్రైవ్ చేస్తే ఎదురొచ్చే వాహనాలను జడ్జ్ చేయలేమని, రంగు & చూపు మందగిస్తుందని తద్వారా ప్రమాదాలు జరుగుతాయని పేర్కొంటున్నారు.

Similar News

News December 28, 2025

ఇతిహాసాలు క్విజ్ – 110

image

ఈరోజు ప్రశ్న: కర్ణుడి అసలు పేరేంటి? ఆయనకు ఆ పేరు ఎలా వచ్చింది? ఆ తర్వాత కర్ణుడిలా ఎందుకు మారింది?
☛ పై ప్రశ్నకు జవాబును సాయంత్రం ఆరు గంటలకు పబ్లిష్ చేస్తాం.
☛ మీకు సమాధానం తెలిస్తే కామెంట్ రూపంలో తెలియజేయండి.
<<-se>>#Ithihasaluquiz<<>>

News December 28, 2025

కాటన్ యూనివర్సిటీలో ఉద్యోగాలు

image

గువాహటిలోని <>కాటన్<<>> యూనివర్సిటీ 9 జూనియర్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం గల అభ్యర్థులు ఫిబ్రవరి 2 వరకు అప్లై చేసుకోవచ్చు. దరఖాస్తు హార్డ్ కాపీ, డాక్యుమెంట్స్‌ను ఫిబ్రవరి 9 వరకు పోస్ట్ చేయాలి. దరఖాస్తు ఫీజు రూ.1000, SC, STలకు రూ.500. వెబ్‌సైట్: https://cottonuniversity.ac.in/

News December 28, 2025

నేడు బాలరాముడిని దర్శించుకోనున్న సీఎం

image

AP: నేడు సీఎం చంద్రబాబు అయోధ్యకు వెళ్లనున్నారు. ఉదయం 9 గంటలకు హైదరాబాద్ నుంచి బయలుదేరి 11 గంటలకు అయోధ్యకు చేరుకుంటారు. శ్రీరామ జన్మభూమి కాంప్లెక్స్‌లో కొలువైన శ్రీరాముడిని దర్శించుకుంటారు. 11.30AM నుంచి 2.30PM వరకు 3 గంటల పాటు బాలరాముడి ఆలయంలోనే ఉండనున్నారు. 3PMకు అయోధ్య నుంచి బయలుదేరి నేరుగా విజయవాడ చేరుకుంటారు.