News April 22, 2025
మతిమరుపు ఎక్కువవుతోందా.. కారణం అదే కావొచ్చు!

శరీరానికి సరిపడా మోతాదులో విటమిన్-కె అందనివారిలో మతిమరుపు సమస్యలు ఎక్కువవుతాయని పోషకాహార నిపుణులు హెచ్చరిస్తున్నారు. ‘దెబ్బ తగిలిన చోట రక్తాన్ని గడ్డ కట్టించడం నుంచి ఎముకలు, మెదడు ఆరోగ్యం వరకు విటమిన్-కె చాలా కీలకం. ఆకుకూరల్లో ఇది పుష్కలంగా లభిస్తుంది. చురుకుగా ఆలోచించడానికి, మెరుగైన జ్ఞాపకశక్తికి పాలకూర, బ్రకోలీ, క్యాబేజీ, పాలు, గుడ్లు, పళ్లు వంటివి పుష్కలంగా తీసుకోవాలి’ అని సూచిస్తున్నారు.
Similar News
News April 22, 2025
రాజీవ్ యువ వికాసం గడువు పొడిగించాలని విజ్ఞప్తి

TG: రాజీవ్ యువ వికాసం పథకానికి 16 లక్షలకు పైగా దరఖాస్తులు వచ్చాయి. దీనికి దరఖాస్తు గడువు ఈ నెల 14నే ముగిసింది. కాగా APR 30 వరకు పొడిగించాలని Dy.CM భట్టిని EBC నేషనల్ ప్రెసిడెంట్ రవీందర్ రెడ్డి కోరారు. ఈ పథకం మొదటి జాబితాలోనే తమను ఎంపిక చేయాలని మంత్రులు, MLAలను నిరుద్యోగులు కోరుతున్నట్లు తెలుస్తోంది. మరోవైపు పథకాన్ని మూడేళ్లు కొనసాగించాలని CM రేవంత్‌కు నేతలు విజ్ఞప్తి చేశారని సమాచారం.
News April 22, 2025
పదేళ్ల పిల్లలకూ సొంతంగా బ్యాంక్ లావాదేవీలకు అనుమతి

ప్రస్తుతం మైనర్లకు బ్యాంక్ అకౌంట్లు తీసుకునే సదుపాయం ఉన్నప్పటికీ ఎవరైనా గార్డియన్‌గా ఉండటం తప్పనిసరి. ఇకపై పదేళ్లు దాటిన పిల్లలు కూడా ఖాతాలను సొంతంగా నిర్వహించుకునేలా RBI మార్గదర్శకాలను విడుదల చేసింది. సేవింగ్స్, టర్మ్ డిపాజిట్ అకౌంట్లను తెరిచి లావాదేవీలను సాగించవచ్చు. ఇంటర్నెట్ బ్యాంకింగ్, ATM, చెక్ బుక్ సదుపాయమూ ఉంటుంది. జులై 1 నుంచి ఈ రూల్స్‌ను అమలు చేయాలని బ్యాంకులను RBI ఆదేశించింది.
News April 22, 2025
నేడు సౌదీ పర్యటనకు ప్రధాని మోదీ

ప్రధాని మోదీ ఇవాళ సౌదీ అరేబియాకు బయలుదేరనున్నారు. సౌదీ రాజు మహ్మద్ బిన్ సల్మాన్ ఆహ్వానం మేరకు జెడ్డాలో ఆయన రెండు రోజులు పర్యటించనున్నారు. మోదీ, సల్మాన్ భేటీ రెండు దేశాల మధ్య సంబంధాలను బలోపేతం చేస్తుందని భారత విదేశీ వ్యవహారాల శాఖ పేర్కొంది. ఈ పర్యటనలో భారీ సంఖ్యలో ఒప్పందాలపై సంతకాలతో పాటు ఆర్థిక, మిలిటరీ భాగస్వామ్యం, రాజకీయ సంబంధాలపై చర్చ జరగనుందని సౌదీలోని భారత అంబాసిడర్ అజాజ్ ఖాన్ వెల్లడించారు.