News August 23, 2025

దులీప్ ట్రోఫీకి గిల్ దూరం? కారణం అదేనా?

image

భారత టెస్టు కెప్టెన్ శుభ్‌మన్ గిల్ అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆయనకు మెడికల్ టీమ్ వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నట్లు సమాచారం. దీంతో ఈ నెల 28 నుంచి జరగబోయే దులీప్ ట్రోఫీకి ఆయన దూరమవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఆసియా కప్‌కు మాత్రం అందుబాటులో ఉంటారని సమాచారం. కాగా దులీప్ ట్రోఫీలో గిల్ నార్త్ జోన్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే.

Similar News

News November 21, 2025

మెదక్: కలెక్టర్‌ను కలిసిన కొత్త డీఈఓ విజయ

image

జిల్లా విద్యాధికారిగా, జిల్లా విద్యా శిక్షణ సంస్థ హవేలీ ఘనపూర్ ప్రిన్సిపల్‌గా పూర్తి స్థాయి బాధ్యతలు స్వీకరించిన విజయ కలెక్టర్ రాహుల్ రాజ్‌ను మర్యాద పూర్వకంగా కలిశారు. పదవ తరగతి వార్షిక పరీక్షలలో వంద శాతం ఫలితాలు సాధించేలా ప్రణాళికలు రూపొందించుకొని పర్యవేక్షించాలన్నారు. ఆమె వెంట జిల్లా సైన్స్ అధికారి రాజిరెడ్డి, సమగ్ర శిక్ష అధికారులు నవీన్, రాజు, ఆడల్ట్ ఎడ్యుకేషన్ కో ఆర్డినేటర్ మురళి ఉన్నారు.

News November 21, 2025

కొత్త లేబర్ కోడ్‌లతో ప్రయోజనాలు..

image

✧ నేటి నుంచి <<18350734>>అమల్లోకి<<>> వచ్చిన లేబర్ కోడ్లతో 7వ తేదీలోపే వేతనం
✧ పురుషులతో సమానంగా మహిళలకు శాలరీ, రాత్రి పనిచేసే అవకాశం
✧ గిగ్, ప్లాట్‌ఫామ్ వర్కర్లకు గుర్తింపు.. PF, ESIC, ఇన్సూరెన్స్, OT చేసే కార్మికులకు డబుల్ పేమెంట్
✧ ఫిక్స్‌డ్ టర్మ్ ఉద్యోగులకు ఏడాది తర్వాత గ్రాట్యుటీ
✧ 40 ఏళ్లు పైబడిన కార్మికులకు ఏటా ఉచిత హెల్త్ చెకప్
✧ ప్రమాదకర రంగాల్లో పనిచేసే వారికి 100% ఆరోగ్య భద్రత

News November 21, 2025

పారిశ్రామికవేత్తలుగా SHG మహిళలకు ప్రోత్సాహం: మంత్రి కొండపల్లి

image

AP: SHG మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దాలని, సకాలంలో బ్యాంకు రుణాలు అందేవిధంగా చర్యలు చేపట్టాలని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అధికారులను ఆదేశించారు. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు 39,000 మందికి పైగా మహిళలు రూ.578 కోట్లతో వ్యాపారాలు ప్రారంభించారని, 2026 మార్చి నాటికి SHGలకు రూ.32,322 కోట్ల రుణాలు అందజేయాలన్నారు. రైతు ఉత్పత్తిదారుల సంఘాలను బలోపేతం చేసి, మద్దతు ఇవ్వాలని సూచించారు.