News April 7, 2025
తులం బంగారం రూ.56వేలు కాబోతోందా..?

రానున్న రోజుల్లో పసిడి ధర 38% మేర పతనం అవుతుందని అంచనా వేస్తున్నట్లు USA అనలిస్ట్ జాన్ మిల్స్ వెల్లడించారు. అమెరికాలో ఇప్పుడు $3080గా ఉన్న ఔన్స్ పుత్తడి $1820కు దిగి రావచ్చన్నారు. అంటే మన దగ్గర 10గ్రా. ₹56వేలకు వస్తుందన్నమాట. బంగారం సప్లై పెరగడం, డిమాండ్ తగ్గడం, మార్కెట్ పరిస్థితులు దీనికి కారణాలుగా పేర్కొన్నారు.
NOTE: ఇది మిల్స్ అంచనా. అన్ని పరిశీలించి కొనుగోలు/అమ్మకాల నిర్ణయం తీసుకోండి.
Similar News
News April 12, 2025
నేడూ పనిచేయనున్న సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులు

AP: రాష్ట్రవ్యాప్తంగా ఇవాళ కూడా సబ్ రిజిస్ట్రార్, జిల్లా రిజిస్ట్రార్, డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ కార్యాలయాలు పనిచేయనున్నాయి. ఉదయం ఉ.11 గం. నుంచి సా.5.30 వరకు సేవలు అందించనున్నాయి. ఈ మేరకు ఇవాళ రెండో శనివారం అధికారులకు సెలవును ప్రభుత్వం రద్దు చేసింది. రిజిస్ట్రేషన్ల శాఖ ఆదాయం పెంపు కోసం ఈ నిర్ణయం తీసుకుంది.
News April 12, 2025
ఇద్దరు బ్యాటర్లు చెలరేగినా SRHని ఆపడం కష్టం: వెటోరీ

దూకుడుగా ఆడితేనే SRH ఆటగాళ్ల అత్యుత్తమ ఆట బయటికొస్తుందని ఆ జట్టు కోచ్ వెటోరీ తెలిపారు. ‘మా బ్యాటర్లకు ఎలాంటి బంతులేయాలన్నదానిపై ఇతర జట్లు పూర్తి ప్లాన్తో వస్తున్నాయి. ఇద్దరు బ్యాటర్లు చెలరేగినా SRHను ఆపడం ఇక కష్టం. ఎవరో ఇద్దరు ఎదురు దాడి మొదలుపెడితే మిగిలినవారికీ ఆ దూకుడు స్ఫూర్తిగా నిలుస్తుంది. మా ప్లేయర్స్ కమ్ బ్యాక్ ఇస్తారన్న నమ్మకం నాకుంది’ అని ధీమా వ్యక్తం చేశారు.
News April 12, 2025
విషాదం.. నీటి కుంటలో పడి ముగ్గురు బాలురు మృతి

AP: అన్నమయ్య జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. మైలపల్లి రాచపల్లిలో నీటి కుంటలో పడి ఏడేళ్ల వయసున్న ముగ్గురు బాలురు మరణించారు. రాజుదేవా, రాజుజయ, యశ్వంత్ నిన్న సాయంత్రం ఆడుకుంటూ వెళ్లి గ్రామ శివారులో ఉన్న కుంటలో పడ్డట్లు తెలుస్తోంది. రాత్రి అయినా పిల్లలు ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు వెతకగా కుంటలో చిన్నారుల మృతదేహాలు కనిపించాయి.