News July 3, 2024
భారత భావి కెప్టెన్ అతడేనా?

టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ టీ20 ఫార్మాట్‌కు వీడ్కోలు పలకడంతో నూతన సారథి అవసరం ఏర్పడింది. ప్రస్తుతం భారత్‌కు కెప్టెన్‌గా ఎవరుంటారనే చర్చ నడుస్తోంది. కాగా వరల్డ్ కప్ విన్నింగ్ టీమ్ నుంచి నలుగురు టీ20 కెప్టెన్సీ రేసులో ఉన్నారు. హార్దిక్ పాండ్య, రిషభ్ పంత్, సూర్యకుమార్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రాలో ఒకరు కెప్టెన్ అయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయి. మరి ఎవరు కెప్టెన్ అయితే బాగుంటుందో కామెంట్ చేయండి.
Similar News
News April 1, 2026
రాష్ట్రంలో 14,553 పోలీస్ ఉద్యోగాలు.. త్వరలో నోటిఫికేషన్

తెలంగాణలో పోలీస్ ఉద్యోగాల భర్తీకి రంగం సిద్ధమవుతోంది. కొత్తగా సంస్థాన్ నారాయణపూర్, ఆమన్‌గల్‌లో స్పెషల్ పోలీస్ బెటాలియన్లు ఏర్పాటు కానున్నాయి. వీటికి అవసరమైన సిబ్బందితో పాటు వివిధ విభాగాల్లో మొత్తం 14,553 కానిస్టేబుళ్లు, ఎస్సైల కోసం పోలీస్ శాఖ రిక్రూట్‌మెంట్ చేపట్టనుంది. ఇందుకు త్వరలోనే నోటిఫికేషన్ వెలువడే అవకాశం కనిపిస్తోంది.
News April 1, 2026
SBI అకౌంట్ వాడుతున్నారా.. కాసేపట్లో..

ఖాతాదారులకు SBI బిగ్ అలర్ట్ ఇచ్చింది. ఇవాళ ఉదయం 11.00 గంటల నుంచి 11.45 గంటల వరకు UPI, IMPS, YONO, ఇంటర్నెట్ బ్యాంకింగ్, NEFT, RTGS సేవలు పనిచేయవని పేర్కొంది. మెయింటెనెన్స్ కారణంగా ఈ అంతరాయం ఏర్పడనుందని తెలిపింది. ఖాతాదారులు UPI Lite, ATM ద్వారా సేవలు పొందొచ్చని, అసౌకర్యానికి చింతిస్తున్నట్లు వెల్లడించింది.
News April 1, 2026
నైట్‌షిఫ్టులతో క్యాన్సర్ ముప్పు: వైద్యులు

ప్రపంచవ్యాప్తంగా క్యాన్సర్ వేగంగా విస్తరిస్తోంది. ముఖ్యంగా నైట్ షిఫ్ట్ చేసే నర్సులు, పోలీసులు, డ్రైవర్లు, టెకీలు జాగ్రత్తగా ఉండాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ‘దీని వల్ల జీవ గడియారం దెబ్బతిని క్యాన్సర్ వచ్చే ముప్పు పెరుగుతుంది. దీనివల్ల మహిళల్లో రొమ్ము, పురుషుల్లో ప్రోస్టేట్ క్యాన్సర్ సోకే ప్రమాదం ఉంది. నిరంతర నైట్ షిఫ్టులను WHO క్యాన్సర్ కారకంగా గుర్తించింది’ అని వారు వివరిస్తున్నారు.


