News June 28, 2024
కొత్త పీసీసీ చీఫ్ రేసులో ఉన్నది వీరేనా?

TG: కేబినెట్ విస్తరణ, కొత్త పీసీసీ చీఫ్ నియామకంపై నేడు క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఈ అంశాలపై సీఎం రేవంత్ రెడ్డి నిన్న రాత్రి ఢిల్లీలో కాంగ్రెస్ పెద్దలతో చర్చించారు. ప్రస్తుతం మంత్రివర్గంలో ఆరు బెర్త్లు ఖాళీగా ఉన్నాయి. దీంట్లో 4 భర్తీ చేయాలని భావిస్తున్నారట. అటు కొత్త పీసీసీ చీఫ్ రేసులో జగ్గారెడ్డి, రాజగోపాల్ రెడ్డి, బలరాం నాయక్, సంపత్ కుమార్, మహేశ్ కుమార్ గౌడ్, మధుయాష్కీ ఉన్నట్లు సమాచారం.
Similar News
News December 2, 2025
నేడు, రేపు, ఎల్లుండి.. నాన్ వెజ్ వద్దు: పండితులు

నేటి నుంచి వరుసగా మూడ్రోజుల పాటు మద్యమాంసాలు మానుకోవడం ఉత్తమమని పండితులు సూచిస్తున్నారు. ‘నేడు శివపార్వతుల ఆరాధనకు పవిత్రమైన ప్రదోషం ఉంది. రేపు సకల కార్యసిద్ధిని కలిగించే హనుమద్వ్రతాన్ని ఆచరిస్తారు. ఎల్లుండి పౌర్ణమి తిథి. దత్త జయంతి పర్వదినం. ఈ 3 రోజులు పూజలు, వ్రతాలకు విశిష్టమైనవి. కాబట్టి ఈ శుభ దినాలలో మద్యమాంసాలను మానేస్తే.. ఆయా వ్రతాల అనుగ్రహాన్ని పూర్తిస్థాయిలో పొందవచ్చు’ అని అంటున్నారు.
News December 2, 2025
తిరుమల తరహాలో అన్ని చోట్లా..: సింఘాల్

AP: తిరుమల తరహాలో TTD పరిధిలోని ఆలయాల్లో రుచికరంగా అన్నప్రసాదాలు అందజేస్తామని TTD ఈవో అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. ఆ ఆలయాలలో అన్నప్రసాదాలు తయారు చేసే పోటు సిబ్బందికి శిక్షణ ఇవ్వాలని సమీక్షలో అధికారులను ఆదేశించారు. TTDలో ఇంకా ఎవరైనా అన్య మతస్తులు ఉంటే వారిని గుర్తించి తదుపరి చర్యలు తీసుకోవాలన్నారు. అమరావతిలోని వేంకటేశ్వరుడి ఆలయ విస్తరణ పనులపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశాలు జారీ చేశారు.
News December 2, 2025
IPL మినీ ఆక్షన్.. 1,355 మంది ప్లేయర్లు రిజిస్టర్

ఐపీఎల్ మినీ ఆక్షన్ కోసం 14 దేశాల నుంచి 1,355 మంది ప్లేయర్లు రిజిస్టర్ చేసుకున్నట్లు క్రిక్బజ్ తెలిపింది. వీరిలో మయాంక్ అగర్వాల్, వెంకటేశ్ అయ్యర్, రాహుల్ చాహర్, కేఎస్ భరత్, పృథ్వీషా తదితరులు ఉన్నారు. భారత్ నుంచి కేవలం రవి బిష్ణోయ్, వెంకటేశ్ అయ్యర్.. గ్రీన్, స్టీవ్ స్మిత్, ఇంగ్లిస్ తదితర 47 మంది ఫారిన్ ప్లేయర్లే రూ.2కోట్ల బేస్ ప్రైజ్ లిస్టులో ఉన్నారు. ఈ నెల 16న అబుదాబి వేదికగా మినీ వేలం జరగనుంది.


