News April 13, 2025
ఆ హీరోతో హీరోయిన్ అనుపమ డేటింగ్?

తమిళ హీరో విక్రమ్ తనయుడు ధృవ్ విక్రమ్, హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ డేటింగ్‌లో ఉన్నారంటూ ప్రచారం జరుగుతోంది. స్పాటిఫైలో వీరిద్దరి పేరిట ‘బ్లూ మూన్’ అనే ప్లే లిస్ట్ కనిపించడం, వారు ముద్దు పెట్టుకున్నట్లుగా ప్రొఫైల్ పిక్చర్ ఉండడంతో డేటింగ్ వార్తలు పుట్టుకొచ్చాయి. ప్రస్తుతం వీరిద్దరూ కలిసి ‘బిసన్’ అనే సినిమా చేస్తున్నారు. దాని ప్రమోషన్ కోసమే ఇలా చేసి ఉంటారని పలువురు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
Similar News
News April 13, 2025
నాని ‘హిట్ 3’ ట్రైలర్ లాంచ్ టైమ్ ఫిక్స్

నాని హీరోగా నటిస్తున్న ‘HIT-ది థర్డ్ కేస్’ సినిమా ట్రైలర్ రిలీజ్ డేట్, టైమ్‌ను మేకర్స్ ప్రకటించారు. రేపు ఉదయం విశాఖపట్నంలోని సంగం థియేటర్‌లో ఈ సినిమా ట్రైలర్‌ను లాంచ్ చేయనున్నట్లు ఓ పోస్టర్ ద్వారా తెలిపారు. అలాగే ఉదయం 11.07 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. శైలేష్ కొలను డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా నటిస్తున్నారు. మే 1న ఈ మూవీ రిలీజ్ కానుంది.
News April 13, 2025
భూ భారతి వెబ్‌సైట్ పారదర్శకంగా ఉండాలి: CM రేవంత్

TG: భూ భారతి వెబ్‌సైట్‌ను సామాన్య రైతులకు కూడా సులభంగా అర్థమయ్యేలా రూపొందించాలని అధికారులను CM రేవంత్ ఆదేశించారు. జూబ్లీహిల్స్ నివాసంలో దీనిపై సమీక్షించారు. 100 ఏళ్లపాటు నడిచే ఈ వెబ్‌సైట్ అత్యాధునికంగా, పారదర్శకంగా ఉండాలన్నారు. భూ సమస్యలను త్వరితగతిన పరిష్కరించేలా రూపొందించాలని.. భద్రత కోసం ఫైర్‌వాల్స్ ఏర్పాటు చేసి, నిర్వహణను విశ్వసనీయ సంస్థకు అప్పగించాలని ఆదేశించారు.
News April 13, 2025
ఆ సినిమాల కోసం ఎదురుచూస్తున్నా: రాజమౌళి

జపాన్‌లో పర్యటిస్తున్న రాజమౌళి అక్కడ మీడియాతో ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో రాబోతున్న ‘డ్రాగన్’ (ప్రచారంలో ఉన్న టైటిల్} మూవీకోసం ఎదురుచూస్తున్నట్లు తెలిపారు. అదే విధంగా ప్రభాస్ ‘స్పిరిట్’, రామ్ చరణ్ ‘పెద్ది’ మూవీలను చూడాలనుకుంటున్నానని పేర్కొన్నారు. ‘RRR బిహైండ్ అండ్ బియాండ్’ డాక్యుమెంటరీ ప్రమోషన్స్ కోసం రాజమౌళి జపాన్ వెళ్లారు.