News November 7, 2024
అగరబత్తి పొగ మంచిదేనా..?
చాలామంది భక్తులు పూజల్లో అగరబత్తుల్ని విపరీతంగా వెలిగిస్తుంటారు. కానీ ఆ పొగ అంత మంచిది కాదని అమెరికాకు చెందిన NIH పరిశోధకుల అధ్యయనంలో తేలింది. అగరబత్తుల పొగ ఎక్కువగా పీలిస్తే క్యాన్సర్ వచ్చే ప్రమాదముందని వారు హెచ్చరించారు. ఒక అగరబత్తిని వెలిగిస్తే 45 మి.గ్రాముల కంటే ఎక్కువ కణాలు విడుదలవుతాయని, అవి సిగరెట్కంటే ఎక్కువని తెలిపారు. ఆ పొగలో ప్రమాదకరమైన పలు కర్బన సమ్మేళనాలు ఉంటాయని వివరించారు.
Similar News
News December 27, 2024
కర్నూలు జిల్లాతో మన్మోహన్కు అనుబంధం
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్కు కర్నూలు జిల్లాతో అనుబంధం ఉంది. జులై 1, 2004న ఆయన జిల్లాలో పర్యటించారు. ఓర్వకల్లు మండలం సోమయాజులపల్లి గ్రామంలో ఆత్మహత్యలకు పాల్పడ్డ రైతు కుటుంబాలకు చెక్కులు పంపిణీ చేశారు. అప్పటి సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డితో కలిసి ఆయన బాధితులకు అండగా నిలిచారు. అలాగే మన్మోహన్ సింగ్ క్యాబినెట్లో కోట్ల జయసూర్యప్రకాశ్ రెడ్డి రైల్వేశాఖ సహాయ మంత్రిగా సేవలందించారు.
News December 27, 2024
డైరెక్టర్ కన్నుమూత
తమిళ దర్శకుడు సభాపతి దక్షిణామూర్తి అలియాజ్ SD సభా(61) అనారోగ్యంతో కన్నుమూశారు. ఈయన తమిళంలో విజయ్కాంత్ హీరోగా భారతన్ మూవీతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. తర్వాత ప్రభుదేవాతో వీఐపీ అనే సినిమాను తెరకెక్కించారు. తెలుగులో 2005లో జగపతిబాబు, కళ్యాణి జంటగా పందెం అనే చిత్రానికి దర్శకత్వం వహించారు. సభా తమిళంలో తీసిన సుందర పురుషుడు అనే సినిమా ‘అందాల రాముడు’గా రీమేక్ చేశారు. మొత్తంగా 10 మూవీలకు పనిచేశారు.
News December 27, 2024
నల్ల బ్యాండ్లతో భారత క్రికెటర్లు
బాక్సింగ్ డే టెస్టులో రెండో రోజు భారత క్రికెటర్లు చేతికి నల్ల బ్యాండ్లతో కనిపించారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణానికి సంతాపంగా వీటిని ధరించారు. రెండో రోజు ఆటలో కమిన్స్(49) వికెట్ను జడేజా తీశారు. మరోవైపు సెంచరీ తర్వాత స్మిత్ దూకుడు పెంచారు. AUS స్కోరు 446/7.