News July 3, 2024
ఇషాన్ కిషన్ కెరీర్ ముగిసినట్లేనా?
టీమ్ ఇండియా వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ అంతర్జాతీయ క్రికెట్ కెరీర్ ముగిసినట్లే కనిపిస్తోంది. భారత్ తరఫున ఏ సిరీస్‌కూ BCCI ఇషాన్‌ను పరిగణనలోకి తీసుకోవడం లేదు. చివరకు జింబాబ్వే టీ20 పర్యటనకు కూడా ఆయనను సెలక్ట్ చేయలేదు. సౌతాఫ్రికా పర్యటనకు ముందు ఇషాన్ అన్ని ఫార్మాట్లలో రెగ్యులర్ ఆటగాడిగా ఉన్నారు. కానీ బోర్డుతో విభేదాలు తలెత్తడంతో సెంట్రల్ కాంట్రాక్టు కూడా కోల్పోయారు.
Similar News
News January 16, 2025
TODAY HEADLINES
✒ వార్ షిప్స్, జలాంతర్గామిని ప్రారంభించిన PM
✒ కొత్త ఆఫీస్ లైబ్రరీకి మన్మోహన్ పేరు: INC
✒ హైకోర్టులకు కొత్త జడ్జిలు.. TGకి నలుగురు, APకి ఇద్దరు
✒ స్కిల్ కేసు: CBN బెయిల్ రద్దు పిటిషన్ కొట్టివేత
✒ తిరుమలలో టికెట్ల స్కామ్.. ఐదుగురు అరెస్ట్
✒ కేటీఆర్ క్వాష్ పిటిషన్‌ను కొట్టేసిన సుప్రీంకోర్టు
✒ TG: ఏప్రిల్ 29 నుంచి మే 5 వరకు EAPCET
✒ TG: ఫిబ్రవరి నుంచి KF బీర్లు బంద్
News January 16, 2025
సొంత ఇల్లు, కారు లేవు.. అఫిడవిట్‌లో కేజ్రీవాల్
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఇవాళ నామినేషన్ వేసిన కేజ్రీవాల్ తనకు రూ.1.73 కోట్ల ఆస్తులున్నట్లు అఫిడవిట్‌లో పేర్కొన్నారు. ఇందులో రూ.2.96లక్షల సేవింగ్స్, రూ.50వేల నగదు ఉన్నట్లు ప్రకటించారు. స్థిరాస్తుల విలువ రూ.1.7 కోట్లని తెలిపారు. తనకు సొంత ఇల్లు, కారు లేవని అందులో పొందుపర్చారు. న్యూఢిల్లీ నుంచి బరిలో నిలిచిన కేజ్రీవాల్ 2020 ఎన్నికల్లో తన ఆస్తుల విలువను రూ.3.4 కోట్లుగా ప్రకటించారు.
News January 16, 2025
నిద్రలో వచ్చే కలల గురించి కొన్ని నిజాలు
ప్రతి ఒక్కరికీ నిద్రలో కలలు రావడం సహజం. అవి ఎందుకు వస్తాయో కచ్చితమైన ఆధారాలేవీ లేవు. కలల గురించి కొన్ని నిజాలు..
✒ ప్రతి నిద్రలో 3-6 కలలు వస్తాయి.
✒ ఒక్కో కల 5- 20ని.లు ఉంటుంది.
✒ నిద్రలేచే సరికి 95% కలలు గుర్తుండవు.
✒ మనకు తీరని కోరికలే కలలుగా వస్తాయి.
✒ కలల వల్ల మెదడులో కొన్ని జ్ఞాపకాలు వృద్ధి చెందుతాయి.
✒ ఇంద్రియాల స్పర్శ జ్ఞానం ఎక్కువగా ఉండటం వల్ల అంధులకు కలలు ఎక్కువగా వస్తాయి.