News March 19, 2025

పాత కార్లు ఉంటే దెబ్బేనా?

image

వాయు కాలుష్యాన్ని తగ్గించేందుకు మధ్యప్రదేశ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకోబోతున్నట్లు సమాచారం. 10 ఏళ్లు పైబడిన డీజిల్, 15 ఏళ్లు పైబడిన పెట్రోల్ వాహనాలను బ్యాన్ చేయాలని యోచిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ నిర్ణయాన్ని అమలు చేస్తే పాత వాహనాలకు ఇంధనం అమ్మరు. ఫిట్‌నెస్ సర్టిఫికెట్ ఇవ్వరు. ఇప్పటికే ఢిల్లీలో నిషేధం అమలవుతోంది. MHతో పాటు మరిన్ని రాష్ట్రాలు ఈ దిశగా అడుగులు వేసే అవకాశం ఉంది.

Similar News

News November 27, 2025

మీడియా సెంటర్‌ను ప్రారంభించిన NZB కలెక్టర్

image

గ్రామ పంచాయతీ ఎన్నికలను పురస్కరించుకుని నిజామాబాద్ కలెక్టరేట్‌లోని రూమ్ నం.30లో ఏర్పాటు చేసిన మీడియా సెంటర్, మీడియా సర్టిఫికేషన్ అండ్ మానిటరింగ్ సెల్ (MCMC)ను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి గురువారం ప్రారంభించారు. పారదర్శకంగా, నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించడానికి మీడియా సహకారం అందించాలని కలెక్టర్ కోరారు. ఇందులో అదనపు కలెక్టర్ అంకిత్, DPO శ్రీనివాస్ రావు పాల్గొన్నారు.

News November 27, 2025

రాజధాని రైతులతో చంద్రబాబు సమావేశం

image

AP: అమరావతి రాజధానికి భూములిచ్చిన రైతులతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయడు సమావేశం అయ్యారు. ఇందులో కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, మంత్రి నారాయణ, ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్, జిల్లా కలెక్టర్ అన్సారియా పాల్గొన్నారు. గ్రామ కంఠాలు, జరీబు, అసైన్డ్, లంక భూములు, వీధిపోటు సమస్యలు, రాజధాని గ్రామాల్లో వసతులు, ఉద్యోగాల కల్పనపై చర్చించారు.

News November 27, 2025

వైట్ ఎగ్స్‌కు రంగేసి నాటుకోడి గుడ్లంటూ..!

image

ఉత్తర్‌ప్రదేశ్‌లోని మురాదాబాద్‌లో నకిలీ నాటు కోడి గుడ్లను తయారుచేస్తోన్న ముఠాను ఫుడ్ సేఫ్టీ అధికారులు పట్టుకున్నారు. బ్రాయిలర్ ఎగ్స్(వైట్)కు రంగులు పూసి నాటు కోడి గుడ్లంటూ అమ్మకాలు జరుపుతున్నట్లు గుర్తించారు. ఇప్పటికే 4.5లక్షలకు పైగా గుడ్లను రంగు మార్చి అమ్మినట్లు గుర్తించగా.. గోదాంలో రెడీ అవుతోన్న మరో 45వేల ఎగ్స్‌ను సీజ్ చేశారు. ఇలాంటి నకిలీ గుడ్ల పట్ల జాగ్రత్తగా ఉండాలని ప్రజలకు సూచించారు.