News April 12, 2024

కవితకు ఇక బెయిల్ రావడం కష్టమేనా?

image

TG: ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసులో BRS MLC కల్వకుంట్ల కవితకు ఇప్పట్లో బెయిల్ రావడం కష్టమేనని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ED, CBI చెరోవైపు ఆమెను విచారణ పేరుతో ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. అటు కోర్టు కూడా ఆమె బెయిల్ పిటిషన్‌ను తిరస్కరిస్తోంది. మరోవైపు IT కూడా రంగంలోకి దిగే అవకాశం ఉన్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. ఆమెపై ముప్పేట దాడి కొనసాగుతుండటంతో ఎన్నికలయ్యేవరకూ బెయిల్ రాదని అంటున్నారు.

Similar News

News October 11, 2024

1.21 కోట్ల కుటుంబాలకు ‘చంద్రన్న బీమా’

image

AP: రాష్ట్రంలోని 1.21 కోట్ల BPL కుటుంబాల్లోని 3.07 కోట్ల మందిని ‘చంద్రన్న బీమా’ పరిధిలోకి తీసుకొచ్చేందుకు కసరత్తు జరుగుతోంది. 18-70 ఏళ్లలోపు వారు ప్రమాదవశాత్తు చనిపోతే ₹10 లక్షలు, సహజంగా మరణిస్తే ₹2 లక్షల మొత్తం చెల్లించేలా ఉన్నతాధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు సమాచారం. ఇందుకు ఏడాదికి ₹2,800 కోట్లు అవసరమవుతుందని అంచనా. త్వరలోనే ప్రభుత్వానికి నివేదిక సమర్పించనున్నట్లు తెలుస్తోంది.

News October 11, 2024

స్థానిక సంస్థల ఎన్నికలపై సీఎం కీలక వ్యాఖ్యలు

image

TG: దసరా తర్వాత రాష్ట్రవ్యాప్తంగా కులగణన చేపట్టేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని సీఎం రేవంత్ స్పష్టం చేశారు. రెండు నెలల్లో ఈ ప్రక్రియను పూర్తి చేసి డిసెంబర్ 9 కల్లా రిజర్వేషన్లు ఖరారు చేస్తామన్నారు. ఆ తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతాయని స్పష్టం చేశారు. పంచాయతీల్లో రిజర్వేషన్లు పెంచుతామన్నారు. కులగణనకు బీసీ సంఘాలు సహకరించాలని కోరారు.

News October 11, 2024

పాక్ దుస్థితి: 5 రోజులు 2 నగరాలు షట్‌డౌన్

image

OCT 14-16 మధ్య జరిగే SCO సమ్మిట్ పాకిస్థాన్ ప్రాణం మీదకొచ్చింది. పటిష్ఠ భద్రత కల్పించేందుకు ఇస్లామాబాద్, రావల్పిండి నగరాలను 5 రోజులు షట్‌డౌన్ చేస్తున్నారు. రెస్టారెంట్లు, వెడ్డింగ్ హాల్స్, కేఫ్స్, స్నూకర్ క్లబ్స్, క్యాష్ అండ్ క్యారీ మార్ట్స్ సహా అన్నిటినీ మూసేస్తున్నారు. బిల్డింగులపై కమాండోలు, స్నైపర్ షూటర్లను మోహరిస్తున్నారు. దేశం దివాలా తీయడంతో తిండి దొరక్క చస్తున్న ప్రజలకు ఇది పెద్ద షాకే.