News July 26, 2024

గొర్రెల పంపిణీ పథకం లేనట్లేనా?

image

TG: కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో గొర్రెల పంపిణీ పథకానికి నిధులేమీ కేటాయించలేదు. దీంతో గత ఆరేళ్లుగా అమలవుతున్న ఆ పథకం ఇక లేనట్లేనని తెలుస్తోంది. వీటి పంపిణీలో అవినీతి ఆరోపణలున్న సంగతి తెలిసిందే. దీనికి తోడు గొర్రెలు, మేకల అభివృద్ధి సమాఖ్యకు కూడా బడ్జెట్‌లో నిరాశే దక్కింది. దీంతో ఆయా వర్గాల్లో ఆందోళన మొదలైంది. యాదవ, కురుమ వర్గాలకు గత BRS ప్రభుత్వం ఈ స్కీంను తెచ్చిన విషయం తెలిసిందే.

Similar News

News April 4, 2026

సూపర్ నేపియర్ గడ్డిని ఎలా పెంచాలి?

image

పశుగ్రాసం కొరతను తగ్గించి, పాడి పశువులకు ఎక్కువ పోషకాలను అందించే గడ్డి సూపర్ నేపియర్. దీన్ని చౌడు నేలలు మినహా ఆరుతడి కలిగిన అన్ని రకాల నేలల్లో పెంచవచ్చు. దీని సాగుకు ముందు దుక్కిలో ఎకరానికి 10 టన్నుల పశువుల ఎరువు, 20 కిలోల సూపర్ ఫాస్పేట్, 20kgల నత్రజని, 10kgల పొటాష్ వేయాలి. భూమిని మెత్తగా దున్ని, ప్రతీ 3 అడుగులకొక బోదెను ఏర్పాటు చేసి, ఎకరాకు 10 వేల కాండపు కణుపులు లేదా వేరు పిలకలు నాటుకోవాలి.

News April 4, 2026

సూపర్ నేపియర్ గడ్డితో పశువులకు కలిగే లాభమేంటి?

image

పచ్చి గడ్డిలో విటమిన్-A అధికంగా ఉంటుంది. సూపర్ నేపియర్ గడ్డిలో 10-12 శాతం మాంసకృత్తులు, 50-55% జీర్ణమయ్యే పదార్థాలు, 28-30 శాతం పీచుపదార్థం ఉంటుంది. ఈ గడ్డిలో చక్కెర పదార్థాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి, పశువులు ఇష్టంగా తింటాయి. దీనివల్ల పాడిపశువుల్లో ఎదుగుదల, సంతానోత్పత్తితో పాటు పాల దిగుబడి పెరుగుతుంది. సూపర్ నేపియర్ గడ్డిని తప్పనిసరిగా చాఫ్ కట్టర్‌తో చిన్న ముక్కలుగా కత్తిరించి పశువులకు వేయాలి.

News April 4, 2026

జుట్టు చివర్లు చిట్లుతున్నాయా..?

image

వాతావరణ మార్పుల వల్ల వెంట్రుకల చివర్లు చిట్లడం ఎక్కువైపోతుంది. ఇలా కాకుండా ఉండాలంటే వారానికి రెండు సార్లు తలస్నానం చెయ్యాలి. తలస్నానానికి మైల్డ్ షాంపూలు వాడటం మంచిది. బయటకి వెళ్తున్నప్పుడు జుట్టంతా కప్పిఉంచుకోవాలి. తలస్నానం తర్వాత హెయిర్ సీరం వాడటం మంచిది. డాక్టర్ సలహా లేకుండా ఎలాంటి మెడికేటెడ్ బ్యూటీ ప్రొడక్ట్స్ వాడకూడదు. అయినా సమస్య తగ్గకపోతే ఒకసారి ట్రైకాలజిస్ట్‌లను సంప్రదించాలి.