News June 6, 2024

అవసరమా.. ఇలాంటి సవాళ్లు

image

నేతల మాటలు, సవాళ్లు కొన్నిసార్లు శృతి మించి వారినే ముంచేస్తున్నాయి. అప్పట్లో తెలంగాణ వస్తే రాజకీయాలు వీడుతానన్న లగడపాటి అలా చేశారు. తాజాగా పవన్ గెలిస్తే తన పేరు పద్మనాభ రెడ్డిగా మార్చుకుంటానన్న ముద్రగడ ఈ మార్పుకు సిద్ధమవుతున్నారు. అప్పట్లో BRS విషయంలో నారాయణ చెవి కోసుకుంటానని, మునుగోడులో ఓడితే మళ్లీ పోటీ చేయనని కోమటిరెడ్డి శపథాలు చేశారు. ప్రజలకు పనులు, ఫలితాలు కావాలి తప్ప ఈ పర్సనల్ సవాళ్లు కాదు.

Similar News

News November 12, 2025

జూబ్లీహిల్స్ పోలింగ్.. ఫైనల్ లెక్క ఇదే

image

TG: జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో 48.49% పోలింగ్ నమోదైందని ఎన్నికల అధికారులు వెల్లడించారు. మొత్తం 4,01,365 ఓటర్లకు గాను 1,94,631 మంది ఓటేశారు. ఈ నెల 14న ఉ.8 గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభం కానుంది. మొత్తం 10 రౌండ్లలో ఓట్లను లెక్కిస్తారు. 42 టేబుళ్లు ఏర్పాటు చేశారు. కాగా మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలుస్తారని అంచనా వేశాయి.

News November 12, 2025

ఢిల్లీ పేలుడు: తబ్లీగీ జమాత్ మసీదులో 15 నిమిషాలు గడిపి..

image

ఢిల్లీ పేలుడు ఘటనలో ప్రధాన నిందితుడిగా భావిస్తున్న ఉమర్ నబీకి సంబంధించి కీలక విషయాలు బయటపడుతున్నాయి. బ్లాస్ట్‌కు ముందు ఓల్డ్ ఢిల్లీలోని తబ్లీగీ జమాత్ మసీదుకు అతడు వెళ్లినట్లు తెలుస్తోంది. అక్కడ 10-15 నిమిషాలు గడిపాడని, తర్వాత ఎర్రకోటలోని పార్కింగ్ ప్లేస్‌కు వెళ్లాడని ఢిల్లీ పోలీసు వర్గాలు తెలిపాయి. అతడు మసీదులోకి వచ్చి వెళ్లిన ఫుటేజీ సీసీటీవీలో రికార్డయిందని చెప్పాయి.

News November 12, 2025

శీతాకాలంలో ఆహారాన్ని మళ్లీ వేడి చేస్తే జరిగేది ఇదే?

image

చలికాలంలో వేడివేడిగా తినాలనే ఉద్దేశంతో చాలామంది ఆహారాన్ని మళ్లీ వేడి చేసుకుంటారు. పదే పదే ఆహారాన్ని వేడి చేస్తే పోషకాలు తగ్గడంతోపాటు బ్యాక్టీరియా పెరిగి ఆరోగ్య సమస్యలు వస్తాయని వైద్యులు చెబుతున్నారు. బియ్యం, బంగాళాదుంపలు, పుట్టగొడుగులు, చికెన్, గుడ్లలో బాసిల్లస్ సెరియస్ అనే బ్యాక్టీరియా పెరిగి కడుపు నొప్పి, వాంతులు, విరేచనాలు, ఫుడ్ పాయిజనింగ్‌కి కారణమవుతుంది. నూనెలు, మసాలాలు ఆక్సిడైజ్ అవుతాయి.