News November 3, 2024

భారత్ WTC ఫైనల్ చేరడం సాధ్యమేనా?

image

WTC ఫైనల్ రేసులో టాప్ గేర్‌లో దూసుకెళుతున్న భారత జట్టుకు న్యూజిలాండ్ క్లీన్‌స్వీప్‌తో షాకిచ్చింది. ఒక్క సిరీస్ ఓటమితో పరిస్థితి మొత్తం తలకిందులైంది. ఇప్పుడు భారత్ WTC ఫైనల్ చేరాలంటే ఆస్ట్రేలియాతో జరిగే బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని 4-0తో గెలవాలి. ఆస్ట్రేలియాను వారి గడ్డపై ఒక్క టెస్టు ఓడించడమే కష్టం.. అలాంటిది సిరీస్ గెలవాలంటే దాదాపు అసాధ్యమనే చెప్పాలి. ఇలా చూస్తే భారత్ WTC ఫైనల్ చేరడం కష్టమే!.

Similar News

News November 11, 2025

RBIలో ఉద్యోగాలు.. ఫలితాలు విడుదల

image

ఆర్బీఐలో 120 గ్రేడ్-B ఆఫీసర్ పోస్టుల కోసం నిర్వహించిన ఫేజ్-1 పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. <>https://rbi.org.in/<<>>లో రిజల్ట్స్ చెక్ చేసుకోవచ్చు. ఎంపికైన వారికి డిసెంబర్ 6న ఫేజ్-2 ఎగ్జామ్ జరగనుంది. అందులోనూ సెలక్ట్ అయిన వారికి ఇంటర్వ్యూలు నిర్వహించి ఉద్యోగాల్లోకి తీసుకుంటారు.

News November 11, 2025

రషీద్ ఖాన్ రెండో పెళ్లి చేసుకున్నారా?

image

AFG క్రికెటర్ రషీద్ ఖాన్ రెండో పెళ్లి చేసుకున్నట్లు వార్తలొస్తున్నాయి. NEDలో జరిగిన ఈవెంట్‌లో రషీద్ ఓ అమ్మ‌ాయితో కనిపించగా ఫొటోలు వైరలయ్యాయి. దీనిపై రషీద్ స్పందిస్తూ ‘2025 AUG 2న నా లైఫ్‌లో కొత్త చాప్టర్ మొదలైంది. ఈవెంట్‌లో నాతో ఉన్నది నా భార్యే’ అని తెలిపారు. కాగా 2024 OCTలోనూ రషీద్‌కు మ్యారేజ్ అయినట్లు వార్తలు రావడంతో ఇది రెండో పెళ్లి అని ప్రచారం జరుగుతోంది. దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది.

News November 11, 2025

ఈ నెల 13 నుంచి అగ్రికల్చర్​ కోర్సు అడ్మిషన్లకు కౌన్సెలింగ్​

image

TG: ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం, అనుబంధ కాలేజీల్లో BSC ఆనర్స్​, అగ్రికల్చర్​ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఈ నెల 13 నుంచి కౌన్సెలింగ్​ నిర్వహించనున్నారు. దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు HYD రాజేంద్రనగర్‌లోని యూనివర్సిటీలో కౌన్సెలింగ్‌కు హాజరు కావాలని అధికారులు సూచించారు. అన్ని సర్టిఫికెట్స్ ఒరిజినల్, జిరాక్స్ కాపీలు తీసుకురావాలని చెప్పారు. సైట్: www.pjtau.edu.in/