News December 20, 2024

జాతీయ జట్టులోకి షమీ ఇప్పట్లో రానట్లేనా?

image

విజయ్ హజారే ట్రోఫీలో తమ తొలి మ్యాచుకు పేసర్ షమీని బెంగాల్ టీమ్ పక్కన పెట్టింది. మోకాలి వాపు నుంచి కోలుకుంటున్న అతనికి రెస్ట్ ఇచ్చినట్లు తెలిపింది. మరోవైపు షమీ 200% ఫిట్ అయ్యాకే జాతీయ జట్టులోకి తీసుకుంటామని కెప్టెన్ రోహిత్ శర్మ తాజాగా ప్రెస్ కాన్ఫరెన్స్‌లో స్పష్టం చేశారు. దీంతో ఆయన నేషనల్ టీమ్‌లోకి ఇప్పట్లో రావడం కష్టమేనని, ఛాంపియన్స్ ట్రోఫీలోనూ ఆడటంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

Similar News

News November 15, 2025

గుంటూరులో హై కోర్టు ఉందని మీకు తెలుసా?

image

1937 నవంబర్ 15న కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాలు ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో ఉన్నప్పుడు, ఈ 2 ప్రాంతాల నాయకులు, బాగ్ అగ్రిమెంట్ పై సంతకాలు చేశారు. దాని ప్రకారం, రాజధాని, హైకోర్టు, విశ్వవిద్యాలయం వేరు వేరు ప్రాంతాలలో ఉండాలి. దీంతో గుంటూరులో 1954 జులై 5న హైకోర్టుని అప్పటి కలెక్టరేట్‌లో నెలకొల్పారు. కర్నూలును (రాయలసీమ) రాజధాని విశ్వవిద్యాలయం విశాఖలో ఉంది (ఆంధ్ర విశ్వ కళా పరిషత్).

News November 15, 2025

తెలంగాణ న్యూస్ రౌండప్

image

* ఇవాళ మధ్యాహ్నం ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి
* దివంగత కవి అందెశ్రీ కొడుకు దత్తసాయికి డిగ్రీ లెక్చరర్ ఉద్యోగం ఇవ్వాలని ప్రభుత్వం యోచన
* నల్గొండ జిల్లాలో వైద్యం వికటించి 17 మంది చిన్నారులకు అస్వస్థత.. వైరల్ ఫీవర్‌తో ప్రభుత్వ ఆసుపత్రిలో చేరిన పిల్లలకు ఇంజెక్షన్ చేయడంతో రియాక్షన్
* నేడు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్‌పై స్పీకర్ గడ్డం ప్రసాద్ విచారణ

News November 15, 2025

మరో కీలక మావో లొంగుబాటు?

image

మావోయిస్టు అగ్రనేతల లొంగుబాటు కొనసాగుతోంది. తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యుడు కొయ్యాడ సాంబయ్య అలియాస్ ఆజాద్, మరో నేత అప్పాసి నారాయణ తమ కేడర్‌తో సరెండర్ కానున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం తెలంగాణకు చెందిన 64 మంది మాత్రమే అజ్ఞాతంలో ఉన్నారు. త్వరలో జరగబోయే లొంగుబాటుతో చాలామంది జనజీవన స్రవంతిలో కలిసే అవకాశముంది. ఇప్పటికే మావో టాప్ కమాండర్లు మల్లోజుల, తక్కళ్లపల్లి లొంగిపోయిన విషయం తెలిసిందే.