News May 4, 2024
ఎన్నికల్లో అభ్యర్థుల ఖర్చును నివారించలేమా?
ఈసీ నిబంధనల ప్రకారం MP అభ్యర్థి గరిష్ఠంగా ₹95 లక్షలు, MLA అభ్యర్థి ₹40 లక్షలు ఖర్చు పెట్టేందుకు అనుమతి ఉంది. వాస్తవంగా ఆ ఖర్చు రూ.కోట్లలో ఉంటోంది. ఇది అందరికీ తెలిసిన విషయమే. నీళ్లలా పారుతోన్న నోట్ల కట్టలు కళ్ల ముందే కనిపిస్తున్నా సరైన చర్యలు ఉండట్లేదు. ఈ విపరీత వ్యయాన్ని నిలుపుదల చేయకపోతే తీవ్ర ప్రమాదమని, గెలిచిన అభ్యర్థుల అవినీతిని పెంచి పోషించడమేనని మేధావులు హెచ్చరిస్తున్నారు.
<<-se>>#ELECTIONS2024<<>>
Similar News
News December 31, 2024
తెలంగాణ సిఫార్సు లేఖలపై చంద్రబాబు కీలక నిర్ణయం
AP: తిరుమలకు తెలంగాణ నేతల నుంచి వచ్చే సిఫార్సు లేఖల్ని ఆమోదించాలని చంద్రబాబు నిర్ణయించారు. ఈమేరకు ఆయన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. చంద్రబాబు నిర్ణయానికి రేవంత్ కృతజ్ఞతలు తెలిపారు. MLA/MLC/MP నుంచి సోమవారం నుంచి గురువారం మధ్యలో ఏవైనా 2 రోజుల్లో వీఐపీ బ్రేక్ దర్శనానికి 2 లేఖలు, స్పెషల్ ఎంట్రీ దర్శనానికి 2 లేఖలు స్వీకరిస్తామని లేఖలో చంద్రబాబు తెలిపారు.
News December 31, 2024
స్పీకర్ గడ్డం ప్రసాద్‌పై కేసు కొట్టివేత
TG: స్పీకర్ గడ్డం ప్రసాద్‌పై 2019లో నమోదైన కేసును హైకోర్టు తాజాగా కొట్టివేసింది. ఆ ఏడాది ఎన్నికల నియమావళి అమలులో ఉన్న సమయంలో వికారాబాద్ ఆర్డీవో కార్యాలయం ఎదుట ఆయన చేసిన దీక్ష నియమాల ఉల్లంఘన కిందికే వస్తుందని పేర్కొంటూ అప్పట్లో ఆయనపై కేసు నమోదైంది. దానిపై ప్రసాద్ హైకోర్టును ఆశ్రయించారు. తాజాగా విచారణ జరిపిన ధర్మాసనం, కేసును కొట్టివేస్తున్నట్లు తీర్పునిచ్చింది.
News December 31, 2024
2015 తర్వాత తొలిసారిగా ఢిల్లీలో ‘స్వచ్ఛ’ డిసెంబర్!
2015 తర్వాత వచ్చిన డిసెంబర్లలో ఢిల్లీలో అత్యంత తక్కువ కాలుష్యం ఈ ఏడాది డిసెంబరులోనే నమోదైందని ఆ రాష్ట్ర అధికారులు ప్రకటించారు. ఈ నెల ప్రథమార్ధంలో బలమైన గాలులు, ద్వితీయార్థంలో రికార్డు స్థాయి వర్షాలు దీని వెనుక కారణాలని వివరించారు. ఇప్పటికీ ఏక్యూఐ ప్రమాదకర స్థాయిలోనే.. అంటే 295 పాయింట్ల వద్ద ఉంది. గుడ్డికంటే మెల్ల మిన్న అన్నట్లుగా ఈ 9ఏళ్లలో ఇది కొంచెం బెటర్ అయిందనేది అధికారుల ప్రకటనలో సారాంశం.