News September 9, 2024
రేపు వర్షాలు ఉన్నాయా?

రేపు ఉ.8.30 గంటల వరకు ఆసిఫాబాద్, మంచిర్యాల, భూపాలపల్లి జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ADB, నిర్మల్, NZB, ములుగు, కరీంనగర్, పెద్దపల్లి జిల్లాలకు ఎల్లో అలర్ట్ ఇచ్చింది. HYD సహా మిగిలిన అన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది. అటు ఏపీలో శ్రీకాకుళం, VZM, మన్యం, అల్లూరి, తూ.గో. జిల్లాల్లో వర్షాలు పడతాయని తెలిపింది.
Similar News
News January 5, 2026
అల్పపీడనం.. రాష్ట్రంలో మోస్తరు వర్షాలు

AP: బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని, దీంతో ఈ నెల 8వ తేదీ తర్వాత శ్రీలంక సమీపంలో అల్పపీడనం ఏర్పడనుందని వాతావరణ నిపుణులు తెలిపారు. 9వ తేదీ నుంచి TNతో పాటు దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని అంచనా వేశారు. మరోవైపు రానున్న 3 రోజుల్లో అల్లూరి, ఏలూరు, ప.గో., NTR, పల్నాడు, గుంటూరు, ప్రకాశం, కడప జిల్లాల్లో మంచు ప్రభావం ఎక్కువగా ఉంటుందని వాతావరణశాఖ చెప్పింది.
News January 5, 2026
శివ మానస పూజలో చదవాల్సిన మంత్రాలు

‘శివ మానస పూజ స్తోత్రం’ దీనికి ప్రధాన మంత్రం. ఇది ‘రత్నైః కల్పితమాసనం’ అని మొదలవుతుంది. ఈ స్తోత్రం చదవడం వీలుకాకపోతే కేవలం ‘ఓం నమః శివాయ’ అనే పంచాక్షరి మంత్రాన్ని మనసులో జపిస్తూ పూజ చేయవచ్చు. లేదా ‘శివోహం శివోహం’ అని స్మరించవచ్చు. చివరగా ‘ఆత్మా త్వం గిరిజా మతిః’ అనే శ్లోకాన్ని పఠించినా విశేష ఫలితాలుంటాయి. ఈ పూజలో మన ప్రతి కర్మను శివుడికి అర్పించాలి. శివ మానస పూజను ఎవరైనా, ఎప్పుడైనా ఆచరించవచ్చు.
News January 5, 2026
వరి నాట్లు.. ఇలా చేస్తే అధిక ప్రయోజనం

వరి రకాల పంట కాలాన్ని బట్టి 22-28 రోజుల వయసుగల నారును నాట్లు వేసుకోవాలి. వరి నారు కొనలను తుంచి నాటితే కాండం తొలుచు పురుగు, ఇతర పురుగుల గుడ్లను నాశనం చేయవచ్చు. నాట్లు పైపైనే 3సెంటీమీటర్ల లోతులోనే నాటితే పిలకలు ఎక్కువగా వస్తాయి. నాటేటప్పుడు పొలంలో ప్రతి 2 మీటర్ల దూరానికి 20 సెం.మీ కాలిబాటలు వదలాలి. కాలిబాటలు తూర్పు పడమర దిశగా ఉంచాలి. దీనివల్ల మొక్కలకు గాలి, వెలుతురు బాగా అంది చీడల సమస్య తగ్గుతుంది.


