News September 2, 2024

ఇంత దుర్మార్గమా? ప్రాణం తీసిన మనిషి దురాశ

image

గజ ఈతగాడి దురాశ ఓ వ్యక్తి ప్రాణాన్ని బలితీసుకున్న ఘటన UPలో జరిగింది. ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ డిప్యూటీ డైరెక్టర్ ఆదిత్య వర్ధన్ తన మిత్రులతో కలిసి గంగానది నానామావ్ ఘాట్ వద్ద స్నానానికి వెళ్లాడు. పొరపాటున నీటిలో పడిపోయాడు. స్నేహితులకు ఈత రాకపోవడంతో సునీల్ కశ్యప్ సాయం కోరారు. అయితే అతను ₹10వేలు ఇస్తేనే దూకుతానని చెప్పాడు. వారి దగ్గర క్యాష్ లేకపోవడంతో ఆన్‌లైన్‌లో చేసేలోపే ఆదిత్య నీటిలో మునిగి చనిపోయాడు.

Similar News

News October 21, 2025

రైల్వేలో 5,810 ఉద్యోగాలు.. నేటి నుంచి దరఖాస్తులు

image

రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ (RRB) 5,810 NTPC పోస్టులకు నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. నేటి నుంచి నవంబర్ 20 వరకు అప్లై చేసుకోవచ్చు. జూనియర్ అకౌంట్ అసిస్టెంట్, అసిస్టెంట్ స్టేషన్ మాస్టర్, గూడ్స్ గార్డ్, ట్రాఫిక్ అసిస్టెంట్, గూడ్స్ ట్రైన్ మేనేజర్, సీనియర్ క్లర్క్ లాంటి ఉద్యోగాలు ఉన్నాయి. వయసు పోస్టులను బట్టి 18-33 ఏళ్ల మధ్య ఉండాలి. డిగ్రీ పూర్తై ఉండాలి. పూర్తి వివరాలకు ఇక్కడ <>క్లిక్<<>> చేయండి.

News October 21, 2025

శ్రీశైలంలో కార్తీక మాసోత్సవాలు.. ఏర్పాట్లు పూర్తి

image

ద్వాదశ జ్యోతిర్లింగం, అష్టాదశ శక్తి పీఠాల్లో ఒకటైన శ్రీశైల మహా క్షేత్రంలో రేపటి నుంచి కార్తీక మాసోత్సవాలు ప్రారంభం కానున్నాయి. భక్తుల రద్దీ నేపథ్యంలో గర్భాలయ, సామూహిక అభిషేకాలు, శని, ఆది, సోమవారాల్లో కుంకుమార్చనలు రద్దు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. పాతాళగంగ వద్ద పుణ్య స్నానాలకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నామన్నారు. యథావిధిగా హోమాలు, కళ్యాణాలు నిర్వహిస్తామని చెప్పారు.

News October 21, 2025

ఏపీ, తెలంగాణ న్యూస్ అప్‌డేట్స్

image

*సీపీఐ ఏపీ కార్యదర్శిగా గుజ్జుల ఈశ్వరయ్య ఎన్నిక
*TTD గోశాలలో గోవుల మృతిపై భూమన కరుణాకర్ ఆరోపణలు. ఈ నెల 23న విచారణకు హాజరుకావాలని పోలీసుల నోటీసులు
*నిజామాబాద్‌లో రియాజ్ ఎన్‌కౌంటర్ ఘటనను సుమోటోగా స్వీకరించిన తెలంగాణ మానవ హక్కుల సంఘం. నవంబర్ 24లోగా పూర్తి నివేదిక ఇవ్వాలని డీజీపీకి ఆదేశాలు
*భీమవరం డీఎస్పీపై ప.గో. ఎస్పీకి డిప్యూటీ సీఎం పవన్ ఫిర్యాదు. సివిల్ వివాదాల్లో జోక్యం చేసుకోకుండా చూడాలని సూచన