News March 3, 2025
ఆదిలాబాద్కు అన్యాయమేనా?

TG: పేరులోనే ఆది ఉంది కానీ అభివృద్ధికి మాత్రం ఆదిలాబాద్ దూరంగానే ఉంటోందని ప్రజలు నిరాశ చెందుతున్నారు. వరంగల్ తర్వాత ఆదిలాబాద్లోనూ ఎయిర్పోర్ట్ ఏర్పాటుపై ప్రకటన వస్తుందని వారు కన్న కలలు కల్లలయ్యాయి. ఎక్కడా లేని విధంగా ADBలో స్థలం అందుబాటులో ఉండగా, స్థానిక ప్రజా ప్రతినిధులు చొరవ చూపట్లేదనే విమర్శలు వస్తున్నాయి. ADBతోపాటు కొత్తగూడెం, రామగుండంలోనూ ఎయిర్పోర్టు నిర్మించాలని ప్రజలు కోరుతున్నారు.
Similar News
News March 3, 2025
ట్రెండింగ్లో ‘కాంగ్రెస్ కా బాప్ రోహిత్’

భారత కెప్టెన్ రోహిత్ శర్మపై కాంగ్రెస్ అధికార ప్రతినిధి <<15636348>>షామా మహమ్మద్ చేసిన కామెంట్స్ <<>>దుమారం రేపుతున్న సంగతి తెలిసిందే. ఆ వ్యాఖ్యలపై రోహిత్ ఫ్యాన్స్ తీవ్రంగా మండిపడుతున్నారు. టీమ్ ఇండియాకు చేసిన సేవకు ఇదా మీరు ఇచ్చే గౌరవమంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆ ఆగ్రహం కాంగ్రెస్ మీదకూ పాకింది. ‘కాంగ్రెస్ కా బాప్ రోహిత్’ అన్న హాష్ ట్యాగ్ ట్రెండింగ్లో ఉంది. ఇప్పటికే 10.5వేల ట్వీట్లు పడ్డాయి.
News March 3, 2025
ఉత్తరాంధ్ర టీచర్ MLCగా గాదె శ్రీనివాసులు విజయం

AP: ఉత్తరాంధ్ర టీచర్ MLCగా PRTU అభ్యర్థి గాదె శ్రీనివాసులు విజయం సాధించారు. రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో ఆయన గెలుపొందారు. శ్రీనివాసులు 10,068 ఓట్ల మ్యాజిక్ ఫిగర్ దాటడంతో విజేతగా ప్రకటించారు. మరోవైపు, వెయ్యికి పైగా ఓట్లు తిరస్కరణకు గురయ్యాయి. విజేతను డిసైడ్ చేసే ప్రక్రియలో 8మందిని ఎలిమినేషన్ చేయాల్సి వచ్చింది. ఉదయం 8గంటలకు ప్రారంభమైన లెక్కింపు ప్రక్రియ 11గంటల పాటు సాగింది.
News March 3, 2025
రష్యా-ఉక్రెయిన్ మధ్య ‘నెల రోజుల శాంతి’కి యోచన: ఫ్రాన్స్

రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధానికి నెలరోజుల విరామం ఇచ్చి శాంతిని పాటించేలా ప్రణాళికలు రచిస్తున్నట్లు ఫ్రాన్స్ అధ్యక్షుడు మేక్రాన్ తెలిపారు. లండన్లో ఐరోపా దేశాల అధినేతలు ఇటీవల భేటీ అయ్యారు. బ్రిటన్ కూడా శాంతి ఒప్పందం యోచనకే మొగ్గు చూపుతోందని ఆయన పేర్కొన్నారు. ‘రష్యా అధ్యక్షుడు శాంతికి కట్టుబడి ఉంటారో లేదో దీనితో తేలుతుంది. ఆ తర్వాతే అసలైన శాంతి చర్చలు ప్రారంభమవుతాయి’ అని తేల్చిచెప్పారు.