News July 20, 2024

వన్డేల్లో జడ్డూ కెరీర్ ముగిసినట్లేనా?

image

ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా ODI కెరీర్ ముగిసినట్లేనా? ఇకపై టెస్టులకు మాత్రమే పరిమితం కానున్నారా? శ్రీలంకతో వన్డే సిరీస్‌‌కు జడ్డూకు మొండిచేయి చూపిన సెలక్టర్లు అవుననే సంకేతాన్ని ఇచ్చినట్లు తెలుస్తోంది. T20Iల నుంచి ఆయన ఇప్పటికే రిటైరయ్యారు. వచ్చే ODI వరల్డ్‌కప్ కోసం యువ జట్టును సిద్ధం చేసే క్రమంలోనే జడేజాను BCCI పక్కన పెట్టినట్లు సమాచారం. ఈ ఆల్‌రౌండర్ 197 వన్డేల్లో 2756 రన్స్ చేసి 220 వికెట్లు తీశారు.

Similar News

News October 31, 2025

అమరావతి, గన్నవరంలో మెగా రైలు టెర్మినళ్లు!

image

AP: అమరావతి, గన్నవరంలో మెగా టెర్మినళ్లు నిర్మించేందుకు రైల్వేశాఖ సిద్ధమవుతోంది. అమరావతిలో 8 రైల్వే లైన్లు ఏర్పాటు చేస్తారు. ఇక్కడే ట్రైన్ల హాల్టింగ్ ఉంటుంది. భవిష్యత్తులో 120 రైళ్లు రాకపోకలు సాగించేలా దీన్ని అభివృద్ధి చేస్తారు. దీనికోసం 300 ఎకరాల అవసరముంది. అటు గన్నవరంలో ప్రస్తుతం 3 ప్లాట్‌ఫామ్స్ ఉండగా విజయవాడకు ప్రత్యామ్నాయంగా 10 లైన్లు ఏర్పాటు చేస్తారు. దీనికి 143 ఎకరాలు కావాలి.

News October 31, 2025

మావోయిస్టు డంపుల్లో 400 కిలోల గోల్డ్?

image

మావోయిస్టులు లొంగిపోతున్న నేపథ్యంలో వాళ్లు సేకరించిన పార్టీ ఫండ్ ఏమైందన్న దానిపై నిఘా వర్గాలు దృష్టి సారించాయి. నిధుల సేకరణకు వారికి విస్తృత నెట్వర్క్ ఉన్నట్లు NIA గుర్తించింది. ఆ ఫండ్‌ను కొవిడ్ టైమ్‌లో బంగారంగా మార్చినట్లు దర్యాప్తులో వెల్లడైంది. పార్టీ సానుభూతిపరుల పేర్లతోనూ డొల్ల కంపెనీలు పెట్టి రూ.కోట్లు మళ్లిస్తున్నారని, వారి వద్ద రూ.400 కోట్ల నిధులు, 400 KGల గోల్డ్ ఉండొచ్చని అనుమానిస్తోంది.

News October 31, 2025

సబ్జా గింజలతో కురులకు బలం

image

సబ్జా గింజలు చర్మానికే కాదు జుట్టుకు కూడా మంచి పోషకాలు అందిస్తాయని నిపుణులు అంటున్నారు. ఈ గింజలలోని విటమిన్ కె, బీటా కెరోటిన్, ప్రొటీన్లు.. వెంట్రుకలు, కుదుళ్లు దృఢంగా మారేలా చేస్తాయని, వీటిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల జుట్టు రాలే సమస్య నుంచి బయటపడొచ్చని నిపుణులు చెబుతున్నారు. అయితే ఇవి కొందరికి పడకపోవచ్చు. కాబట్టి వాడే ముందు వ్యక్తిగత నిపుణులు సలహా తీసుకోవాలని సూచిస్తున్నారు.