News August 1, 2024

కమల ఇండియనా లేక నల్లజాతి మహిళా?: ట్రంప్

image

US అధ్యక్ష బరిలో నిలిచిన డెమోక్రాట్ అభ్యర్థి కమలా హారిస్‌పై ట్రంప్ విమర్శలు గుప్పించారు. ‘ఆమె ఎప్పుడూ ఇండియన్ వారసత్వాన్నే ప్రచారం చేశారు. ఇప్పుడు సడన్‌గా నల్లజాతి మహిళగా పిలిపించుకోవాలనుకుంటున్నారు. కమల ఇండియన్ లేదా బ్లాక్ అనే విషయం నాకు తెలియదు’ అని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీనిపై వైట్‌హౌస్ స్పందించింది. ట్రంప్ వ్యాఖ్యలు అవమానకరంగా ఉన్నాయని పేర్కొంది.

Similar News

News November 2, 2025

నేడు బిహార్‌లో ప్రధాని మోదీ ప్రచారం

image

నేడు ప్రధాని మోదీ బిహార్‌లో ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. మధ్యాహ్నం 1.30 గంటలకు భోజ్‌పుర్ జిల్లా అర్రాలో పబ్లిక్ మీటింగ్‌లో పాల్గొంటారు. మ.3.30 గంటలకు నవాడాలో ప్రచార సభకు హాజరవుతారు. పట్నాలో సాయంత్రం 5.30 గంటలకు రోడ్‌షో నిర్వహిస్తారు. అటు కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా పలు ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో పాల్గొననున్నారు.

News November 2, 2025

ఉగ్రవాదులను తుడిచిపెట్టేస్తాం: ట్రంప్

image

నైజీరియాలో క్రైస్తవుల హత్యలు ఆగకపోతే అన్ని సహాయ సహకారాలు ఆపేస్తామని US అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరించారు. ‘ఆ దేశంలోకి చొచ్చుకెళ్లి ఇస్లామిక్ ఉగ్రవాదులను పూర్తిగా నాశనం చేయొచ్చు. తక్షణమే తగిన చర్యలు తీసుకోవాలని మా యుద్ధ విభాగాన్ని ఆదేశిస్తున్నా. క్రైస్తవులపై ఉగ్రవాదులు దాడి చేసినట్లుగానే మా దాడి వేగంగా, దారుణంగా, మధురంగా ఉంటుంది. నైజీరియా ప్రభుత్వం వేగంగా చర్యలు తీసుకోవాలి’ అని హెచ్చరించారు.

News November 2, 2025

క్రమశిక్షణ కమిటీ ముందుకు కొలికపూడి, చిన్ని

image

AP: విజయవాడ MP కేశినేని చిన్ని, తిరువూరు MLA కొలికపూడి శ్రీనివాసరావు మధ్య వివాదంపై TDP క్రమశిక్షణ కమిటీ చర్యలకు దిగింది. సీఎం ఆదేశాలతో వారితో మాట్లాడేందుకు సిద్ధమైంది. ఈ నెల 4న 11AMకు కొలికపూడిని, అదే రోజు 4PMకు చిన్నిని తమ ఎదుట హాజరు కావాలని సమాచారం అందించింది. అనుచరుల హడావుడి లేకుండా ఒంటరిగా రావాలని పేర్కొంది. పార్టీ, సంస్థాగత పదవుల విషయంలో ఇరువురి వివాదం నెలకొన్న విషయం తెలిసిందే.