News November 7, 2024
కేసీఆర్‌పై కక్షగట్టి విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమా?: KTR

TG: రాష్ట్రంలో వరుసగా ఫుడ్ పాయిజన్ ఘటనలు చోటు చేసుకుంటున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని కేటీఆర్ విమర్శించారు. ‘విద్యార్థుల అవస్థలు రేవంత్ రెడ్డి కంటికి కనిపించడం లేదా? విద్యాశాఖను అంటిపెట్టుకొని 11 నెలల్లో ఏం చేశారు? కాంగ్రెస్ వచ్చింది.. సకల జనులను కన్నీళ్లు పెట్టిస్తోంది. కేసీఆర్‌పై కక్షగట్టి గురుకుల, ఆశ్రమ పాఠశాలల విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమా?’ అని ప్రశ్నించారు.
Similar News
News January 28, 2026
2.0లో కార్యకర్తలకు టాప్ ప్రయారిటీ: జగన్

AP: దుర్మార్గపు పాలన చేస్తున్న చంద్రబాబుకు ప్రజలు తగిన బుద్ధి చెబుతారని మాజీ CM జగన్ పేర్కొన్నారు. ‘ఏడాదిన్నర తర్వాత పాదయాత్ర చేస్తా. 150 నియోజకవర్గాల్లో పర్యటిస్తా. CBN తప్పుడు పాలనను ప్రజలకు వివరిద్దాం. ప్రతి ఇంట్లో చర్చ జరిగేలా పార్టీనేతలు చొరవ చూపాలి. క్రితంసారి కొవిడ్ వల్ల పాలనపై ప్రత్యేక దృష్టి పెట్టాల్సి వచ్చింది. 2.0లో కార్యకర్తలకు అధిక ప్రాధాన్యం ఇస్తా. ఇది నా హామీ’ అని జగన్ వివరించారు.
News January 28, 2026
తన జీతం ఎంతో చెప్పిన SBI PO.. నెట్టింట చర్చ!

తన జీతం గురించి ఓ SBI PO చెప్పిన విషయాలు నెట్టింట చర్చకు దారితీశాయి. ‘2022లో PO(ప్రొబెషనరీ ఆఫీసర్)గా ఎంపికయ్యా. నా జీతం ₹95 వేలు. 2.5 ఏళ్లలో 5 ఇంక్రిమెంట్లు వచ్చాయి’ అని తెలిపారు. అలవెన్సుల కింద మరో ₹29 వేలు వస్తాయని చెప్పారు. 2.5ఏళ్లకే ₹లక్షకు పైగా జీతం వస్తే రిటైర్మెంట్ టైమ్‌కు ఇంకెంత వస్తుందోనని నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. కొందరు అభినందిస్తుండగా, ఇది ఎలా సాధ్యమని మరికొందరు ప్రశ్నిస్తున్నారు.
News January 28, 2026
సంజూకు ఇది చివరి అవకాశమా?

IND T20 ఓపెనర్ శాంసన్‌కు ఇవాళ NZతో జరిగే 4వ T20 చివరి అవకాశమని క్రీడావర్గాలు పేర్కొంటున్నాయి. తొలి 3 టీ20ల్లో 16 పరుగులే చేసిన అతనిపై ఇషాన్ కిషన్ రూపంలో కత్తి వేలాడుతోందని చెబుతున్నాయి. అటు తొలి 2 మ్యాచుల్లో విఫలమైనా 3వ దాంట్లో రాణిస్తాడనుకుంటే డకౌట్ అయ్యారు. ఇదే టైమ్‌లో కిషన్ సూపర్ ఫామ్‌లో ఉన్నారు. ఇవాళ సంజూ మరోసారి నిరాశపరిస్తే ఇషాన్ ఓపెనర్‌గా, తిలక్ నం.3లో ఫిక్స్ అవుతారనే చర్చ నడుస్తోంది.


