News October 27, 2024

కింగ్ కోహ్లీ ఆల్విదాకు ఆసన్నమైందా?

image

టీమ్ ఇండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ పూర్తిగా తేలిపోతున్నారు. ఈ ఏడాది టెస్టుల్లోనే కాకుండా వన్డే, టీ20ల్లోనూ రాణించలేకపోయారు. 5 టెస్టుల్లో 245, 3 వన్డేల్లో 58, 10 టీ20ల్లో 180 పరుగులు మాత్రమే చేశారు. ఈ ఏడాది పూర్తి కావస్తున్నా ఆయన బ్యాట్ నుంచి ఏ ఫార్మాట్‌లోనూ సెంచరీ రాలేదు. అర్థ సెంచరీ చేయడానికే ఆయన అవస్థలు పడుతున్నారు. దీంతో కోహ్లీ రిటైర్ కావాలని కొందరు నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

Similar News

News December 3, 2025

ఇతిహాసాలు క్విజ్ – 85 సమాధానాలు

image

ఈరోజు ప్రశ్న: పాండురాజు మరణానికి గల కారణం ఏంటి?
సమాధానం: పాండురాజు వేటకు వెళ్లినప్పుడు, జింకలుగా భావించి కిందమ అనే మహామునిపై బాణం వేస్తాడు. దీంతో ఆ ముని మరణిస్తూ పాండురాజు తన భార్యతో కలిసిన తక్షణమే మరణిస్తాడని శపిస్తాడు. ఈ శాపం కారణంగా, ఒకరోజు మాద్రితో కలిసినప్పుడు పాండురాజు తక్షణమే మరణించారు. దాంతో మాద్రి సహగమనం చేసింది.
<<-se>>#Ithihasaluquiz<<>>

News December 3, 2025

T20 వరల్డ్ కప్‌కి టీమ్ ఇండియా జెర్సీ రిలీజ్

image

ఐసీసీ మెన్స్ టీ20 వరల్డ్ కప్ 2026కు సంబంధించిన టీమ్ ఇండియా జెర్సీని బీసీసీఐ రిలీజ్ చేసింది. రాయ్‌పూర్‌లో SAతో జరుగుతున్న రెండో వన్డే ఇన్నింగ్స్ బ్రేక్ సమయంలో రోహిత్ శర్మ, తిలక్ వర్మ ఈ జెర్సీలను అన్‌వెయిల్ చేశారు. ‘టీమ్‌కు ఎప్పుడూ నా బెస్ట్ విషెస్ ఉంటాయి’ అని రోహిత్ శర్మ పేర్కొన్నారు. 2026 ఫిబ్రవరి 7నుంచి టీ20 వరల్డ్ కప్ ప్రారంభంకానుంది.

News December 3, 2025

టీ20 సిరీస్‌కు భారత జట్టు ప్రకటన.. గిల్ రీఎంట్రీ

image

సౌతాఫ్రికాతో ఈ నెల 9 నుంచి జరగనున్న 5 మ్యాచుల టీ20 సిరీస్‌కు బీసీసీఐ జట్టును ప్రకటించింది. గాయం నుంచి కోలుకున్న గిల్ తిరిగి జట్టులో చోటు సంపాదించారు. ఫిట్‌నెట్‌ను బట్టి ఆయన ఆడే అవకాశాలుంటాయని బోర్డు తెలిపింది.

టీమ్: సూర్య కుమార్(కెప్టెన్), గిల్, అభిషేక్, తిలక్, హార్దిక్ పాండ్య, దూబే, అక్షర్, జితేశ్ శర్మ, శాంసన్, వరుణ్ చక్రవర్తి, కుల్దీప్, హర్షిత్ రాణా, వాషింగ్టన్ సుందర్, బుమ్రా, అర్ష్‌దీప్