News November 23, 2024
KTR సిద్ధమా?.. మల్లు రవి సవాల్
TG: నాగర్ కర్నూల్ జిల్లా వంగూరు(M) కొండారెడ్డిపల్లి మాజీ సర్పంచ్ సాయి రెడ్డి ఆత్మహత్యతో CMకు సంబంధం లేదని MP మల్లు రవి తెలిపారు. గ్రామంలో గ్రామస్థుల కోరిక మేరకు ప్రభుత్వ స్థలంలో పశువుల ఆసుపత్రి నిర్మించారని, మాజీ సర్పంచ్ ఇంటికి దారి కూడా వదిలేశారన్నారు. దారి లేనట్టు నిరూపిస్తే ఎలాంటి శిక్షకైనా సిద్ధం అని, KTR సిద్ధమేనా? అని సవాల్ విసిరారు. రాజకీయ లబ్ధి కోసం అవాస్తవాలు ప్రచారం చేయడం ఆపాలన్నారు.
Similar News
News November 23, 2024
మహారాష్ట్ర అసెంబ్లీలో ప్రతిపక్ష నేత లేనట్లే!
ప్రతిపక్ష హోదా దక్కాలంటే అసెంబ్లీలోని మొత్తం సీట్లలో 10% గెలుచుకోవాలి. MHలో 288 సీట్లకు గాను 29 సీట్లలో విజయం సాధిస్తే LoP ఇస్తారు. మహావికాస్ అఘాడీలోని ఏ పార్టీకి అన్ని సీట్లు వచ్చే అవకాశం లేదు. శివసేన (UBT)- 20, కాంగ్రెస్-13 (3 ఆధిక్యం), NCP (శరద్ పవార్)- 10 స్థానాలు మాత్రమే గెలిచాయి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, అరుణాచల్, గుజరాత్, మణిపుర్, నాగాలాండ్, సిక్కింలలో ప్రతిపక్ష నేతలు లేరు.
News November 23, 2024
గంభీర్ నాకు ఇచ్చిన సలహా అదే: హర్షిత్ రాణా
తన టెస్టు కెరీర్కు మంచి ఆరంభం లభించడం వెనుక కోచ్ గౌతమ్ గంభీర్ ఇచ్చిన సలహాలున్నాయని భారత పేసర్ హర్షిత్ రాణా తెలిపారు. ఆయన తనకు మద్దతుగా నిలిచారని పేర్కొన్నారు. ‘ఆటగాళ్లకు ఎప్పుడూ అండగా నిలిచే వ్యక్తి గంభీర్. ఓపికతో ఉండాలన్నదే ఆయన నాకు ఇచ్చిన సలహా. దేశానికి ఆడే అవకాశం వచ్చాక భారత ప్రజల్ని గుర్తుపెట్టుకుని సర్వశక్తులూ ఒడ్డి ఆడాలని సూచించారు. అదే చేస్తున్నా’ అని తెలిపారు.
News November 23, 2024
వారికి AR రెహమాన్ లీగల్ నోటీసులు
తనపై అవాస్తవాలు ప్రచారం చేసేవారిపై AR రెహమాన్ చట్టపరమైన చర్యలకు సిద్ధమయ్యారు. భార్య సైరా బానుతో విడిపోతున్నట్లు ఆయన ప్రకటించగా, ఆ విషయంపై రూమర్స్ వచ్చాయి. అర్థరహిత సమాచారం వ్యాప్తి చేసేవారికి లీగల్ నోటీసులు పంపాలని రెహమాన్ చెప్పినట్లు ఆయన లీగల్ టీమ్ పేర్కొంది. యూట్యూబ్, ఎక్స్, ఇన్స్టా, ఫేస్ బుక్, ఇతర సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ నుంచి అభ్యంతరకర కంటెంట్ను వెంటనే తొలగించాలని డిమాండ్ చేసింది.