News July 5, 2025

ఏపీ పరిధిలోకి మధిర రైల్వే స్టేషన్?

image

APలో కొత్త రైల్వే జోన్ ఏర్పాటు కానుండటంతో SCR పరిధిలో డివిజన్ల సరిహద్దులు మారనున్నాయి. SCRలో SEC, HYD, నాందేడ్ డివిజన్లు ఉండనుండగా, విశాఖ జోన్‌లోకి GNT, విజయవాడ, గుంతకల్లు వెళ్తాయి. TGలోని మోటమర్రి, మధిర, ఎర్రుపాలెం, గంగినేని, చెరువు మాధవరం స్టేషన్లు VJA పరిధిలోకి వెళ్తాయి. GNT పరిధిలోని విష్ణుపురం-పగిడిపల్లి(NLG, మిర్యాలగూడ), జాన్‌పహాడ్ సెక్షన్లు SECలో కలిపే ప్రతిపాదనలు రైల్వే బోర్డుకు చేరాయి.

Similar News

News July 5, 2025

డైట్ కోక్ అధికంగా తాగుతున్నారా?

image

చాలా మంది షుగర్ ఉండదనే నెపంతో డైట్ కోక్ తాగేందుకు ఇష్టపడుతుంటారు. అయితే, వీటిని అమితంగా సేవించడం ప్రమాదకరమని వైద్యులు హెచ్చరిస్తున్నారు. డైట్ కోక్‌లను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల మెటబాలిక్ సిండ్రోమ్ ప్రమాదం పెరుగుతుందని తెలిపారు. అలాగే అప్పుడప్పుడు వీటిని తాగితే హాని ఉండదని పేర్కొన్నారు. కానీ దీర్ఘకాలికంగా ఉపయోగిస్తే జీవక్రియ దెబ్బతినడంతో పాటు వివిధ అనారోగ్య సమస్యలు వస్తాయని చెబుతున్నారు.

News July 5, 2025

భారత్, బంగ్లాదేశ్ వైట్ బాల్ సిరీస్ వాయిదా

image

భారత్, బంగ్లాదేశ్ పురుషుల క్రికెట్ జట్ల మధ్య ఈ ఏడాది ఆగస్టులో జరగాల్సిన వైట్ బాల్ సిరీస్ వాయిదా పడింది. దీనిని వచ్చే ఏడాది సెప్టెంబర్‌లో నిర్వహించనున్నట్లు BCCI ప్రకటించింది. ఇరు దేశాల క్రికెట్ బోర్డులు దీనికి అంగీకారం తెలిపాయని పేర్కొంది. షెడ్యూల్ ప్రకారం IND, BAN మధ్య 3 వన్డేలు, 3 టీ20లు జరగాల్సి ఉంది. భద్రతా కారణాల దృష్ట్యా ఈ సిరీస్ రద్దయ్యే అవకాశం ఉందని ఇటీవల ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే.

News July 5, 2025

టెట్ ప్రిలిమినరీ కీ విడుదల

image

తెలంగాణ టెట్ ప్రాథమిక కీ విడుదలైంది. ఈ నెల 8 వరకు అభ్యంతరాలు తెలపవచ్చని అధికారులు పేర్కొన్నారు. గత నెల 18 నుంచి 30 వరకు 9 రోజుల పాటు 16 సెషన్లలో టెట్ పరీక్షలు జరిగిన సంగతి తెలిసిందే. పేపర్-1కు 74.65శాతం, పేపర్-2(మ్యాథ్స్ అండ్ సైన్స్)కు 73.48, పేపర్-2(సోషల్ స్టడీస్)కు 76.23శాతం అభ్యర్థులు హాజరయ్యారు. కీ కోసం ఇక్కడ <>క్లిక్<<>> చేయండి.