News April 2, 2025

నా టాలెంట్ సరిపోవడం లేదా?: పాయల్

image

నటి పాయల్ రాజ్‌పుత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో నెపోటిజంపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ‘సినీ ప్రపంచంలో టాలెంట్‌ను నెపోటిజం, ఫేవరెటిజం తొక్కేస్తున్నాయి. అవకాశాలు చేజారి ప్రముఖుల వారసులకు వెళ్లినప్పుడు నా టాలెంట్ సరిపోవడం లేదా అని సందేహం కలుగుతుంది’ అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. #struggleisreal అని హాష్‌ట్యాగ్ జత చేశారు. కాగా ప్రస్తుతం పాయల్ తెలుగులో ‘వెంకటలచ్చిమి’ మూవీ చేస్తున్నారు.

Similar News

News December 1, 2025

KNR: గుర్తుల అల్ఫాబెటికల్ ఆర్డర్ ప్రకారం అభ్యర్థుల పేర్లు

image

సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికల్లో గుర్తుల కేటాయింపుపై అభ్యర్థుల్లో టెన్షన్ నెలకొంది. ఎన్నికల అధికారులు అభ్యర్థుల పేర్లు గుర్తుల అల్ఫాబెటికల్ ఆర్డర్ ప్రకారం కేటాయిస్తారు. కాగా ఓటర్లు ఈజీగా గుర్తుపట్టే గుర్తులిస్తే బాగుంటుందని, ఎక్కువగా వాడని గుర్తులు అలాట్ చేస్తే ఓటర్లు ఇబ్బంది పడే ఛాన్స్ ఉందని పలువురు చర్చిస్తున్నారు. ఐతే ఎక్కువమంది బరిలో ఉంటే అనువైన గుర్తులు రావని అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు.

News December 1, 2025

14,967 ఉద్యోగాలు.. అప్లైకి 3రోజులే ఛాన్స్

image

కేంద్రీయ విద్యాలయాలు, జవహర్ నవోదయల్లో 14,967 (13,025 టీచింగ్, 1,942 నాన్ టీచింగ్) పోస్టులకు అప్లై చేయడానికి ఇంకా మూడు రోజులే( DEC 4) సమయం ఉంది. పోస్టును బట్టి PG, డిగ్రీ, B.Ed, M.Ed, MCA, ME, M.Tech, M.PEd, BCA, BE, B.Tech, CTET, B.PEd, B.LiSc, ఇంటర్, డిప్లొమా ఉత్తీర్ణులైన వారు అప్లై చేసుకోవచ్చు. వెబ్‌సైట్: kvsangathan.nic.in/ *మరిన్ని ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం<<-se_10012>> జాబ్స్ <<>>కేటగిరీకి వెళ్లండి.

News December 1, 2025

కోహ్లీ 100 సెంచరీలు చేస్తారా?

image

SAపై నిన్న కోహ్లీ చెలరేగిన తీరు చూస్తే సచిన్ 100 సెంచరీల రికార్డును చేరుకోవడం కష్టం కాదేమో అని క్రీడా వర్గాల్లో టాక్ మొదలైంది. 2027 WCకు ముందు భారత్ ఇంకా 20 వన్డేలు ఆడనుంది. లీగ్‌లో ఫైనల్‌కు చేరితే మరో 5 నుంచి 10 మ్యాచులు ఆడే ఆస్కారం ఉంది. ప్రస్తుతం 83 శతకాలు బాదిన కోహ్లీ ఇక నుంచి ప్రతి 3 మ్యాచులకు 2 సెంచరీలు చేస్తే సచిన్ సరసన నిలిచే ఛాన్సుంది. మరి విరాట్ ఆ ఘనత సాధిస్తారా? మీ COMMENT.