News September 29, 2024
ఆ సెంటిమెంట్ కొనసాగిస్తున్న ఎన్టీఆర్?

దేవర హిట్ కొట్టడంతో నెట్టింట తారక్ ఫ్యాన్స్ సందడి చేస్తున్నారు. ఫ్లాప్ చూసిన దర్శకుడికి వెంటనే హిట్ ఇవ్వాలంటే తారక్ తర్వాతేనని కొనియాడుతున్నారు. బాబీకి సర్దార్ గబ్బర్ సింగ్ తర్వాత జై లవకుశ, అజ్ఞాతవాసి తర్వాత త్రివిక్రమ్‌కు అరవింద సమేత, హార్ట్ఎటాక్ మూవీ తర్వాత టెంపర్‌తో పూరీకి, నేనొక్కడినే తర్వాత సుకుమార్‌కు నాన్నకు ప్రేమతో, ఆచార్య తర్వాత కొరటాలకు దేవరతో హిట్స్ ఇచ్చారని గుర్తుచేసుకుంటున్నారు.
Similar News
News December 10, 2025
వాస్తు ప్రకారం 4 మూలల్లో ఏమేం ఉండాలి?

ఇంటి మూలలు ప్రకృతి శక్తులకు అనుగుణంగా ఉండాలని వాస్తు శాస్త్రం సూచిస్తోంది. దీని ప్రకారం.. ఇంటికి ఈశాన్య మూలలో గుంట(లోతు/నీరు), ఆగ్నేయ మూలలో మంట(వంటగది), నైరుతి మూలలో మెట్టగా(ఎత్తుగా, బరువుగా), వాయువ్య మూలలో గాలి(చలనం) ఉండేలా చూసుకోవాలని వాస్తు నిపుణులు కృష్ణాదిశేషు సూచిస్తున్నారు. ఇది మంచి సంబంధాలకు, చలనానికి తోడ్పడుతుందని వివరిస్తున్నారు. <<-se>>#Vasthu<<>>
News December 10, 2025
పవన్‌కు నీతి, ధర్మం లేవు: అంబటి

AP: పరకామణి చోరీ విషయంలో జగన్ వ్యాఖ్యలను పవన్ వక్రీకరిస్తున్నారని మాజీ మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు. అసలు పవన్ ఏ ధర్మాన్ని పాటిస్తున్నారని ప్రశ్నించారు. ‘నేను బాప్టిస్ట్ మతం తీసుకున్నానని ఒకసారి, సర్వమతాలూ సమానమని మరోసారి అన్నాడు. ఇప్పుడు సనాతనమే తన ధర్మం అంటున్నాడు. నీకో ధర్మం లేదు, నీతి లేదు, మతం లేదు, సిద్ధాంతం లేదు. నీకున్న ఒకే ఒక్క సిద్ధాంతం CBN చెప్పింది చేయడం’ అని సెటైర్లు వేశారు.
News December 10, 2025
AP న్యూస్ రౌండప్

*58,204మంది అంగన్వాడీ వర్కర్లకు 5G ఫోన్స్ అందించే కార్యక్రమాన్ని ప్రారంభించిన మంత్రి సంధ్యారాణి
*ఉచిత సివిల్స్ కోచింగ్‌కు మెరిట్, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారం 100మంది ఎంపిక: మంత్రి సవిత
*రైతుల నుంచి MSPకి కొన్న ప్రతి గింజను వేగంగా రైళ్లలో FCI గోదాములకు తరలిస్తున్నాం: మంత్రి నాదెండ్ల మనోహర్
*ఏపీ టెట్ స్కూల్ అసిస్టెంట్(తెలుగు)- 2A పరీక్షకు 2 సెషన్స్‌లో కలిపి 17,181మంది అభ్యర్థులు హాజరు


