News November 10, 2024
ప్రభాస్ ‘సలార్-2’లో కొరియన్ నటుడు?

ప్రభాస్ హీరోగా తెరకెక్కనున్న ‘సలార్-2’లో కొరియన్ సూపర్ స్టార్ డాన్ లీ నటించనున్నట్లు సమాచారం. తాజాగా ఆయన ‘సలార్-2’ పోస్టర్‌ను ఇన్‌స్టాలో స్టోరీగా పెట్టుకోవడంతో ఈ మూవీలో నటించనున్నారనే చర్చ మొదలైంది. ‘ది ఔట్‌లాస్’, ‘ది గ్యాంగ్ స్టర్’, ‘అన్‌స్టాపబుల్’, ‘ఛాంపియన్’ వంటి హాలీవుడ్, కొరియన్ చిత్రాల్లో ఆయన నటించారు. అంతకుముందు స్పిరిట్లోనూ డాన్ లీ నటిస్తారనే చర్చ జరిగిన సంగతి తెలిసిందే.
Similar News
News December 1, 2025
కోహ్లీ 100 సెంచరీలు చేస్తారా?

SAపై నిన్న కోహ్లీ చెలరేగిన తీరు చూస్తే సచిన్ 100 సెంచరీల రికార్డును చేరుకోవడం కష్టం కాదేమో అని క్రీడా వర్గాల్లో టాక్ మొదలైంది. 2027 WCకు ముందు భారత్ ఇంకా 20 వన్డేలు ఆడనుంది. లీగ్‌లో ఫైనల్‌కు చేరితే మరో 5 నుంచి 10 మ్యాచులు ఆడే ఆస్కారం ఉంది. ప్రస్తుతం 83 శతకాలు బాదిన కోహ్లీ ఇక నుంచి ప్రతి 3 మ్యాచులకు 2 సెంచరీలు చేస్తే సచిన్ సరసన నిలిచే ఛాన్సుంది. మరి విరాట్ ఆ ఘనత సాధిస్తారా? మీ COMMENT.
News December 1, 2025
భారీ జీతంతో NTPCలో ఉద్యోగాలు.. అప్లైకి ఎల్లుండే లాస్ట్ డేట్

<
News December 1, 2025
లైంగిక వేధింపులు.. హీరోయిన్ కజిన్ ఆత్మహత్య

లైంగిక వేధింపులను భరించలేక హీరోయిన్ ఆశికా రంగనాథ్ కజిన్ అచల(22) ఆత్మహత్య చేసుకున్నారు. ‘దూరపు బంధువు మయాంక్‌తో అచలకు స్నేహం ఏర్పడింది. డ్రగ్స్‌కు బానిసైన మయాంక్ ఆమెను ప్రేమిస్తున్నానని ఫిజికల్ రిలేషన్ కోసం ఒత్తిడి చేశాడు. ఆమె నిరాకరించడంతో దాడి చేసి, మానసికంగా వేధించాడు’ అని బంధువులు ఆరోపిస్తున్నారు. అచల Nov 22న బెంగళూరులో ఉరేసుకుందని, ఇప్పటికీ మయాంక్‌పై చర్యలు తీసుకోలేదని మండిపడుతున్నారు.


