News March 6, 2025
ప్రభాస్‌కు గాయం? టీమ్ ఏం చెప్పిందంటే..

స్టార్ హీరో ప్రభాస్ కాలికి గాయమైందని, కొద్ది రోజుల పాటు సినిమా షూటింగ్‌లకు దూరమవుతారని జరుగుతున్న ప్రచారంపై ఆయన టీమ్ క్లారిటీ ఇచ్చింది. ప్రభాస్‌కు ఎలాంటి గాయం కాలేదని, అసత్య ప్రచారాలు వ్యాప్తి చేయొద్దని కోరింది. కాగా ప్రభాస్ ఫస్ట్ ఫ్లోర్ నుంచి కిందపడటంతో తీవ్ర గాయమైందని, ఇటలీ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారని పలు సైట్లు వార్తలు ప్రచురించాయి.
Similar News
News March 6, 2025
రాజన్న ఆలయంలో దర్గాను తొలగించాలని హుండీలో చీటీలు

తెలంగాణలోని ప్రముఖ వేములవాడ రాజరాజేశ్వర ఆలయ ప్రాంగణంలోని దర్గాను తొలగించాలని కొద్ది రోజులుగా పలు హిందూ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ క్రమంలో కొందరు భక్తులు ‘దర్గా హఠావో.. వేములవాడ బచావో’ అని చీటీలు రాసి హుండీలో వేశారు. ఆలయ సిబ్బంది వీటిని గమనించి తొలగించారు. కాగా, ఈ దర్గాను రెండు ముస్లిం వర్గాలు నిర్వహిస్తున్నాయి.
News March 6, 2025
నోటిఫికేషన్ విడుదల

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ 357 సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ (అసిస్టెంట్ కమాండెంట్) పోస్టులకు నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఇందులో BSFలో 24, CRPFలో 204, CISFలో 92, ITBPలో 4, SSBలో 33 ఖాళీలు ఉన్నాయి. డిగ్రీ పూర్తి చేసి, 20-25 ఏళ్ల వయసు ఉన్న వారు దరఖాస్తు చేసుకోవచ్చు. రాత పరీక్ష, ఫిజికల్ టెస్టులు, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. దరఖాస్తులకు చివరి తేదీ మార్చి 25.
సైట్: upsc.gov.in/
News March 6, 2025
విద్యకు దూరమైన బాలిక.. స్పందించిన సీఎం

TG: బర్త్ సర్టిఫికెట్, ఆధార్ లేదంటూ HYD సనత్‌నగర్‌కు చెందిన శ్రీవిద్య(8)ను స్కూలులో చేర్చుకోలేదన్న వార్తపై CM రేవంత్ స్పందించారు. ‘శ్రీవిద్య సమస్య నా దృష్టికి వచ్చింది. ఆమె పాఠశాలకు వెళ్లకపోవడానికి ఆధార్ లేకపోవడం కారణం కాదని విచారణలో తేలింది. కుటుంబ కారణాల వల్లే ఆమె స్కూలుకు దూరమైంది. అధికారులు ఆమెను తిరిగి స్కూలులో చేర్పించారు. తను మంచిగా చదివి భవిష్యత్తులో గొప్పగా రాణించాలి’ అని ట్వీట్ చేశారు.