News March 9, 2025

ఆలస్యమవుతున్న ‘రాజాసాబ్’? అదే కారణమా?

image

ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న హారర్ కామెడీ మూవీ ‘ది రాజాసాబ్’. ఈ సినిమా సింహభాగం షూటింగ్ పూర్తయింది. అయితే ఓ విచిత్రమైన పరిస్థితి కారణంగా పోస్ట్ ప్రొడక్షన్ ఆలస్యమవుతున్నట్లు సమాచారం. ఇప్పటి వరకూ పూర్తైన ఫుటేజీ ఏకంగా మూడున్నర గంటలు ఉన్నట్లు తెలుస్తోంది. దాన్ని తగ్గించేందుకు మూవీ టీం చెమటోడుస్తోందని సినీవర్గాలంటున్నాయి. ప్రభాస్ ఇందులో తాత, మనవడి పాత్రల్లో కనిపిస్తారని టాక్.

Similar News

News January 21, 2026

రేపు జగన్ మీడియా సమావేశం

image

AP: YSRCP చీఫ్, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గురువారం మీడియా సమావేశం నిర్వహించనున్నారు. ఉదయం 11 గంటలకు తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడతారని పార్టీ ప్రకటన విడుదల చేసింది. సమకాలీన అంశాలపై సమావేశంలో జగన్ ప్రసంగిస్తారని వివరించింది.

News January 21, 2026

నీటి నిష్క్రమణ ఏ దిశలో ఉండటం వాస్తు సమ్మతం?

image

ఇంటి వాడకం నీరు, వర్షపు నీరు ఈశాన్యం నుంచే వెళ్లాలని అంటారు. కానీ ఇది అన్ని దిశల ఇళ్లకు వర్తించదని వాస్తు నిపుణులు కృష్ణాదిశేషు సూచిస్తున్నారు. ‘పడమర/ దక్షిణం వైపు రోడ్లు ఉన్న ఇళ్లకు ఈశాన్యం లోపలి వైపు ఉంటుంది. అలాంటివారు పడమర వాయువ్యం/దక్షిణ ఆగ్నేయం దిశల నుంచి నీటిని బయటకు పంపాలి. ప్రతి దిక్కుకు ఉండే శుభ ఫలితాలనిచ్చే మూలల ద్వారా నీరు వెళ్లడం వల్ల ఎటువంటి హాని జరగదు’ అంటున్నారు. <<-se>>#Vasthu<<>>

News January 21, 2026

FEB 15 తర్వాత మిట్టల్ స్టీల్ ప్లాంట్‌కు శంకుస్థాపన

image

AP: CM CBNతో ఆర్సెల్లార్ మిట్టల్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ లక్ష్మీ మిట్టల్ భేటీ అయ్యారు. అనకాపల్లి ప్రాంతంలో ఏర్పాటు చేయతలపెట్టిన స్టీల్ ప్లాంట్ అంశాలపై చర్చించారు. FEB 15 తరువాత ప్లాంటుకు శంకుస్థాపన చేయాలని నిర్ణయించారు. ఆలోపు భూసేకరణ, అనుమతులు పూర్తి చేయాలని CM అధికారులను ఆదేశించారు. అవసరమైతే ఢిల్లీ వెళ్లి కేంద్రం నుంచి త్వరితగతిన అనుమతులు సాధించాలని మంత్రులు లోకేశ్, టీజీ భరత్‌లకు సూచించారు.