News July 7, 2024

‘గేమ్ ఛేంజర్’లో రామ్‌చరణ్ షూటింగ్ కంప్లీట్?

image

శంకర్ డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న గేమ్ ఛేంజర్ మూవీలో రామ్ చరణ్ వంతు షూటింగ్‌ నిన్నటితో ముగిసినట్లు సమాచారం. ఇతర నటీనటులపై కొంత షూటింగ్ మిగిలి ఉన్నట్లు తెలుస్తోంది. పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్‌గా రానున్న ఈ సినిమాలో చెర్రీ తండ్రీకొడుకులుగా నటిస్తున్నారని టాక్. కియారా హీరోయిన్‌గా, అంజలి, శ్రీకాంత్, నవీన్ చంద్ర, సునీల్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. విడుదల తేదీపై త్వరలోనే క్లారిటీ రానుంది.

Similar News

News December 8, 2025

‘Mr.COOL’ వ్యాపార సామ్రాజ్యం @ ₹1000 కోట్లు

image

ధోనీలో క్రికెటే కాదు ఎవరూ గుర్తించని వ్యాపార కోణమూ ఉంది. కూల్‌గా ఫోకస్డ్‌గా ఆడుతూ ట్రోఫీలు సాధించినట్లే.. సైలెంట్‌గా ₹1000CR వ్యాపార సామ్రాజ్యాన్నీ స్థాపించారు. చెన్నైతో ఉన్న అనుబంధం అతని వ్యాపార దృక్పథాన్ని మార్చేసింది. చెన్నై ఫుట్‌బాల్ క్లబ్ కో ఓనర్‌ మొదలు కార్స్24, ఖాతాబుక్, EMotorad ఫర్ ఎలక్ట్రిక్ సైకిల్స్, Tagda Raho, సెవెన్ ఇన్ లైఫ్ స్టైల్ ఇలా పలు వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టారు.

News December 8, 2025

అఖండ-2 రిలీజ్ ఎప్పుడు?

image

అఖండ-2 సినిమా కొత్త రిలీజ్ డేట్‌పై నిర్మాతలు ఎలాంటి ప్రకటన చేయకపోవడంపై బాలకృష్ణ అభిమానుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. DEC 12న ఎట్టిపరిస్థితుల్లోనూ మూవీ విడుదల చేయాల్సిందేనని SMలో డిమాండ్ చేస్తున్నారు. #WeWantAkhanda2OnDec12th హ్యాష్ ట్యాగ్‌ను ట్రెండ్ చేస్తున్నారు. కొందరైతే నిర్మాతలకు వార్నింగ్ ఇస్తున్నారు. కాగా ఈ శుక్రవారమే రిలీజ్ ఉండే అవకాశం ఉందని పలువురు కామెంట్లు చేస్తున్నారు.

News December 8, 2025

గ్లోబల్ సమ్మిట్‌కు బీజేపీ మద్దతు

image

TG: రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తోన్న ప్రతిష్ఠాత్మక గ్లోబల్ సమ్మిట్‌కు మద్దతిస్తున్నట్లు BJP రాష్ట్ర అధ్యక్షుడు రామ్‌చందర్‌రావు వెల్లడించారు. ‘కేంద్ర ప్రభుత్వం వికసిత్ భారత్ లక్ష్యంగా అన్ని రాష్ట్రాల అభివృద్ధికి సహకరిస్తోంది. తెలంగాణకు కూడా పూర్తి అండగా ఉంటుంది. ఈ సదస్సుకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హాజరవుతారు. సమ్మిట్ విజయవంతమై రాష్ట్రం అన్ని విధాలా అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాం’ అని తెలిపారు.