News July 6, 2024

రెండు రాష్ట్రాల పునరేకీకరణే ఏకైక మార్గమా?: పేర్ని నాని

image

AP: న్యూస్ ఛానళ్ల బ్రేకింగ్ వార్తలు.. రేవంత్, చంద్రబాబు డిమాండ్లు చూస్తుంటే రెండు రాష్ట్రాల పునరేకీకరణే ఏకైక మార్గంగా కనిపిస్తోందని వైసీపీ నేత పేర్ని నాని ఎద్దేవా చేశారు. ఇద్దరు సీఎంల తీరు చూస్తుంటే విడ్డూరంగా ఉందని ట్వీట్ చేశారు. కాగా మరికాసేపట్లో రేవంత్, చంద్రబాబు ప్రజాభవన్‌లో భేటీ కానున్నారు. విభజన సమస్యలపై వీరిద్దరూ చర్చించనున్నారు.

Similar News

News December 27, 2025

సాగులో భూసార పరీక్షలు కీలకం.. నిర్లక్ష్యం వద్దు

image

భూమిలో ఏ పంటలు వేయాలి, ఏ మందులు ఎంత మోతాదులో వేయాలో తెలియక రైతులు అధికమొత్తంలో రసాయన ఎరువులను వాడుతున్నారు. ఇది సాగుభూమికి శాపంగా మారుతోంది. దీనికి పరిష్కారంగా భూసార పరీక్ష, నీటి పరీక్ష, అవసరమైతే పత్ర విశ్లేషణ పరీక్షలు చేయించాలి. వీటి వల్ల నేల, నీరు, ఆకులు, మొక్కల్లో ఏ పోషకాలున్నాయి, పంటలకు ఏ ఎరువులు ఎంత వేయాలనే విషయం కచ్చితంగా తెలుస్తుంది. ఎరువుల వాడకంలో సమతుల్యత పాటిస్తే భూమి సారవంతమవుతుంది.

News December 27, 2025

అప్పుడు లేచిన నోళ్లు.. ఇప్పుడు లేవట్లేదే?

image

క్రికెట్‌లో భారత్ అనగానే ఒంటికాలి మీద వచ్చేవాళ్లు చాలామందే ఉన్నారు. మన పిచ్‌ల వల్ల టెస్ట్ క్రికెట్ చచ్చిపోతోందని నోటికొచ్చిన మాటలన్నారు. అలాంటి వాళ్లు AUS పిచ్‌లపై నోరు మెదపకపోవడం ఆశ్చర్యం. ప్రస్తుత యాషెస్ సిరీస్‌లో NOV 21న పెర్త్‌లో తొలి టెస్ట్, ఇవాళ మెల్‌బోర్న్‌లో 4వ మ్యాచ్ కేవలం రెండ్రోజుల్లోనే ముగిశాయి. మన పిచ్‌లను క్రికెట్‌కు ప్రమాదంగా అభివర్ణించినవాళ్లు ఇప్పుడు మూగబోవడం వింతగా ఉంది.

News December 27, 2025

ప్రాజెక్టులపై అసెంబ్లీలో PPT ప్రజెంటేషన్!

image

TG: ఈనెల 29 నుంచి ఆరంభమయ్యే అసెంబ్లీ సమావేశాలు వాడీవేడిగా సాగనున్నాయి. ముఖ్యంగా సాగునీటి ప్రాజెక్టులపై అధికార, విపక్షాల మధ్య హోరాహోరీ చర్చ జరిగే అవకాశముంది. PPT ప్రజెంటేషన్ ద్వారా దీటుగా జవాబిచ్చేందుకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సిద్ధమవుతున్నారు. అదే తరహాలో తానూ PPTతో ప్రశ్నించడానికి BRS నేత హరీశ్ రెడీ అవుతున్నారు. ఒకవేళ తనను అందుకు అనుమతించకపోతే సభ వెలుపల PPT ప్రదర్శించాలని యోచిస్తున్నారు.