News January 3, 2025

సిడ్నీ టెస్టులో రిషభ్ పంత్‌ కీలకం?

image

సిడ్నీ మైదానంలో టీమ్ ఇండియా స్టార్ ప్లేయర్‌ రిషభ్ పంత్‌కు అద్భుత రికార్డ్ ఉంది. ఇక్కడ ఆయన మూడు ఇన్నింగ్స్‌లు ఆడగా 159*, 36, 97 పరుగులు చేశారు. జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు ఆయన అండగా నిలిచారు. మరోసారి భారత జట్టుకు మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. సిరీస్‌ను 2-2తో సమం చేయాలంటే పంత్ రాణించాలని ఆశిస్తున్నారు. కాగా ఈ వేదికపై భారత్ ఇప్పటివరకు ఒక్క మ్యాచ్ మాత్రమే గెలిచింది.

Similar News

News November 24, 2025

చిత్తూరు: ఇటుకల ట్రాక్టర్ బోల్తా.. ఇద్దరు మృతి

image

కార్వేటినగరం(M) సురేంద్రనగరం కనుమ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పోలీసుల వివరాల మేరకు.. కార్వేటినగరం నుంచి పుత్తూరు వైపు ఇటుకల లోడ్‌తో వెళ్తున్న ట్రాక్టర్ ప్రమాదవశాత్తు బోల్తా పడింది. ట్రాక్టర్ డ్రైవర్, లోడ్‌పై కూర్చుని ఓ మహిళ అక్కడికక్కడే మృతిచెందారు. మరో మహిళ కనుమ కాలువలో పడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. బాధితురాలిని ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News November 24, 2025

భారత్ డైనమిక్స్ లిమిటెడ్‌లో 156 పోస్టులు

image

HYDలోని భారత్ డైనమిక్స్ లిమిటెడ్ (<>BDL<<>>) 156 అప్రెంటిస్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. టెన్త్, ఐటీఐ అర్హతగల అభ్యర్థులు నేటి నుంచి డిసెంబర్ 8 వరకు అప్లై చేసుకోవచ్చు. www.apprenticeshipindia.gov.in పోర్టల్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. దరఖాస్తు హార్డ్ కాపీని డిసెంబర్ 12లోపు పంపాలి. టెన్త్, ఐటీఐలో సాధించిన మార్కులు, మెడికల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://bdl-india.in/

News November 24, 2025

దీపాల కింద కూర్చుని చదువుకున్నా: CJI

image

ఓ చిన్న గ్రామంలో పుట్టి పెరిగిన తాను <<18373221>>CJI<<>> అవుతానని ఎప్పుడూ అనుకోలేదని జస్టిస్ సూర్యకాంత్ అన్నారు. అప్పట్లో న్యాయవ్యవస్థ అంటే ఏంటో కూడా తెలియదని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ‘మా ఊరికి విద్యుత్ సరఫరా సరిగ్గా ఉండేది కాదు. దీపాల కింద కూర్చుని చదువుకున్నా. లాయర్‌గా ప్రాక్టీస్ మొదలుపెట్టినప్పుడు సీనియర్లు ఎంతో సాయం చేశారు. హైకోర్టుకెళ్లాక 5-6 ఏళ్లలోనే విజయవంతమైన లాయర్‌గా పేరు తెచ్చుకున్నా’ అని చెప్పారు.