News April 13, 2025

రోహిత్ పని అయిపోయినట్లేనా?

image

ముంబై ఇండియన్స్ స్టార్ ప్లేయర్ రోహిత్ శర్మ మళ్లీ నిరాశపరిచారు. డీసీతో జరుగుతున్న మ్యాచులో 18 పరుగులే చేసి విఫలమయ్యారు. 2 ఫోర్లు, 1 సిక్సర్‌తో టచ్‌లోకి వచ్చినట్లు కనిపించినా అనూహ్యంగా విప్రజ్ బౌలింగ్‌లో వికెట్ల ముందు దొరికిపోయారు. ఈ సీజన్‌లో CSKపై డకౌట్, GTపై 8, KKRపై 13, RCBపై 17, DCపై 18 పరుగులు చేశారు. కాగా గత IPL సీజన్ నుంచి హిట్‌మ్యాన్ పెద్ద ఇన్నింగ్స్‌లు ఆడని విషయం తెలిసిందే.

Similar News

News January 8, 2026

మొక్కజొన్న కంకిలో చివరి వరకూ గింజలు రావాలంటే?

image

మొక్కజొన్న కంకిలో గింజలు నిండుగా రావాలంటే గింజలు పాలుపోసుకునే దశలో నీటి ఎద్దడి లేకుండా చూసుకోవాలి. పంటకు అవసరమైన నీటిని అందించాలి. అలాగే చివరి దఫా ఎరువుగా నిపుణుల సూచనల మేరకు పొటాష్ అందిస్తే గింజ గట్టిపడి పొత్తు బరువు పెరుగుతుంది. అలాగే పంటకు సిఫార్సు మేరకు యూరియా, ఇతర పోషకాలను సరైన మోతాదులో అందించాలి. మొక్కల మధ్య సరైన దూరం పాటిస్తే అన్ని మొక్కలకు పోషకాలు సమానంగా అందుతాయి.

News January 8, 2026

ఇవాళ మూసుకోనున్న శ్రీవారి వైకుంఠ ద్వారం

image

AP: ముక్కోటి ఏకాదశి సందర్భంగా తిరుమలలో గత నెల 30న తెరుచుకున్న శ్రీవారి వైకుంఠ ద్వారం ఇవాళ అర్ధరాత్రి 12 గంటలకు మూసివేయనున్నారు. ఇంతటితో వైకుంఠ ద్వార దర్శనాలు పూర్తి కానున్నాయి. మొత్తం 10 రోజుల్లో మొదటి 3 రోజులకు ఈ-డిప్ ద్వారా టోకెన్లు జారీ చేశారు. మిగతా 7 రోజుల్లో సర్వదర్శనానికి వచ్చిన భక్తులకు అవకాశం కల్పించారు. రేపటి నుంచి యథావిధిగా ప్రత్యేక దర్శనాలు తిరిగి ప్రారంభం కానున్నాయి.

News January 8, 2026

ఎంచివేస్తే, ఆరిక తరుగుతుందా?

image

కొందరు తమ దగ్గర ఉన్న సంపదను పదే పదే లెక్కబెడుతూ ఉంటారు. దాని గురించే ఆలోచిస్తూ ఉంటారు. నిరంతరం ఆ ధ్యాసలోనే బతుకుతారు. అయితే మన దగ్గర ఉన్న సంపద లేదా ధాన్యాన్ని ఎన్నిసార్లు లెక్కపెట్టినా అవి పెరిగిపోవు, తరగిపోవు. అవి మొదట ఎంత ఉన్నాయో, ఎన్నిసార్లు లెక్కించినా అంతే ఉంటాయి. వాటి గురించి పదే పదే ఆలోచన తగదు అని చెప్పే సందర్భంలో ఈ సామెత వాడతారు.